»   » ‘అత్తారింటికి దారేది’కి... దూకుడు సెంటిమెంట్!

‘అత్తారింటికి దారేది’కి... దూకుడు సెంటిమెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రానికి, మహేష్ బాబు నటించిన హిట్ మూవీ 'దూకుడు' చిత్రానికి సంబంధం ఏమిటి? అనుకుంటున్నారా?...సంబంధం ఏమీ లేదుకానీ, ఓ విషయంలో మాత్రం సెంటిమెంటుగా ఫీలవుతోంది ఆ చిత్ర హీరోయిన్ సమంత.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ యూరఫ్ లో జరుగుతోంది. షూటింగులో పాల్గొనేందుకు హీరోయిన్ సమంత ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకుంది. దూకుడు చిత్రం షూటింగ్ సమయంలో దిగిన హోటల్‌లో, సేమ్ రూమ్‌ను సమంతకు కేటాయించారట. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్లో పేర్కొంటూ 'దూకుడు షూటింగ్ సమయంలో స్టే చేసిన సేమ్ హోటల్, సేమ్ రూమ్.....సెంటిమెంటు కలిసొస్తుందనే స్టాఫ్ ఈ రూమ్ కేటాయించి ఉంటారు. దూకుడు రిజల్ట్ రిపీట్ కావాలనే మా స్టాఫ్ ఇలా చేసి ఉంటారు. హ..హ....వాళ్లకి సెంటిమెంటు ఎక్కువే' అంటూ సమంత ట్వీట్ చేసింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టు నెలలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Samantha tweeted, "Switzerland.... Staying in the same hotel that I stayed in while shooting for dookudu.. Irony.. The same room too. My staff think its good luck... The movie might have the same result as dookudu.. Ha ha....sentimentalists"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu