'దూసుకెళ్తా' ట్రైలర్ కి సెన్సార్ సమస్య
హైదరాబాద్ :మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'దూసుకెళ్తా' ట్రైలర్‌ను రివ్యూ కమిటీకి పంపారు. వీరూ పోట్ల దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను సెన్సార్ క్లియరెన్స్‌కు పంపగా, ట్రైలర్‌లో ఉన్న 'దొబ్బేయ్' అనే పదం కారణంగా దానికి 'యు' సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారని విష్ణు తెలిపారు. దీంతో ఈ ట్రైలర్‌ను రివ్యూ కమిటీకి పంపినట్లు ఆయన చెప్పారు. ఇదివరకు మంచు విష్ణు సినిమా 'దేనికైనా రెడీ' విషయంలోనూ సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి.
మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి జంటగా వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దూసుకెళ్తా'. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా.ఎం.మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 11న విడుదలకు సిద్ధమవుతోంది. మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలకు విశేషమైన స్పందన లభిస్తోంది. ఇది ఇలా ఉండగా ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను సెన్సార్ క్లియరెన్స్‌కు పంపగా... సదరు ట్రైలర్‌లో 'దొబ్బెయ్' అనే పదం ఉన్న కారణంగా... సెన్సార్ బోర్డు అధ్యక్షురాలు ధనలక్ష్మి 'దూసుకెళ్తా' ట్రైలర్‌కు 'యు' సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని అన్నారట. అయితే 'దొబ్జెయ్' అనే పదం సినిమాలకు గానీ, చిత్ర పరిశ్రమకుగానీ కొత్తేమీ కాదు.
ఇప్పటివరకు ధనలక్ష్మీచే సెన్సార్ చేయబడిన చాలా చిత్రాల్లో దొబ్బెయ్ అనేపదం విరివిగా ఉపయోగించబడిందని, కానీ ధనలక్ష్మీ మాత్రం 'దూసుకెళ్తా' చిత్రం ట్రైలర్ విషయంలో ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కాక 'దూసుకెళ్తా' చిత్ర బృందం బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న మంచు విష్ణు కేవలం 'దొబ్బెయ్' అనే పదం ఉన్న కారణంగా... 'దూసుకెళ్తా' చిత్రానికి 'యు' సర్టిఫికేట్ ఇవ్వననడం ఎంత వరకు న్యాయం అని ధనలక్ష్మిని ప్రశ్నించారు. అయినప్పటికీ ధనలక్ష్మీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తెలుగు చలన చిత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ ట్రైలర్ రివ్యూ కమిటీకి పంపించారు.
ఇక ఈ చిత్రంలో రవితేజ గళం వినిపిస్తుంది. ఇందులో కథానాయకుడి పాత్ర చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడిగా ఎదిగే నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. అవి ఆద్యంతం సరదాగా సాగుతాయట. ఆ సన్నివేశాలకి రవితేజ గళాన్ని అందించారు. విష్ణు, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రమిది. వీరు పోట్ల దర్శకుడు. మోహన్‌బాబు నిర్మాత. వీరు పోట్ల మీడియాతో మాట్లాడుతూ ''రవితేజ గళంతో సాగే సన్నివేశాలు ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టేలా ఉంటాయి. సినిమా ప్రారంభంలోనే ఆయన గొంతు వినిపిస్తుంది. ఇందులో విష్ణు పాత్రికేయుడిగా కనిపిస్తారు''అని తెలిపారు.


Click it and Unblock the Notifications












