twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరుతో సినిమా అంటూ రామానాయుడు ప్రకటన

    By Srikanya
    |

    డాక్టర్ డి.రామానాయుడు తాను చిరంజీవితో సినిమా తీస్తానని బహిరంగంగా ప్రకటించారు.అయితే దానికి అదే స్టేజిపై ఉన్న చిరంజీవి మాత్రం స్పందించలేదు.హరినాథ్ పోలిచెర్ల దర్శకత్వం వహించి,హీరోగా నటించిన 'రాజేంద్ర'చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం లో ఈ విశేషం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా రామానాయుడు, విశిష్ట అతిథిగా చిరంజీవి హాజరయ్యారు.అప్పుడు రామానాయుడు మాట్లాడుతూ..''చిరంజీవిని ముద్దుగా రాజా అని పిలవడం నాకు అలవాటు. తనతో 'సంఘర్షణ" లాంటి విజయవంతమైన చిత్రాన్ని తీశాను. మా రాజా డేట్లిస్తే సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా తీస్తానని ఇం తకుముందే, ఇక్కడే అడిగాను. మంచి కథ ఉంటే చేద్దామన్నా డు. చిరంజీవిని దృష్టిలో ఉంచుకుని ఎవరైనా కథలతో వస్తే సినిమా తీస్తాం. ఒకవేళ చిరంజీవి మంత్రి అయినా సరే.. ప్రత్యేక అనుమతితోనైనా సిని మా తీస్తాం. అందులో వచ్చే లాభాలను చారిటీ గా ట్రస్టుకు ఇస్తాం.దానికి చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించారు. మంచి కథతో వస్తే తప్పకుండా చేద్దాం అన్నారు""అని డా. డి.రామానాయుడు చెప్పారు.అయితే ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి ఆ ఊసే ఎత్తలేదు.ఆయన మాట్లాడుతూ."రాజేంద్ర'ను అవయవదానం గురించి రూపొందించారు. ఒక వ్యక్తి చనిపోతూ అవయవ దానం చేస్తే 9మందికి జీవన దానం చేసినట్లే. చనిపోయి కూడా బతకొచ్చు. కొన్నేళ్లక్రితం రక్తదానం గురించి నాకు తెలిసినప్పుడు దాన్ని ఆషామాషీగా తీసుకోలేదు. చాలా ఆలోచించి రక్త, నేత్రదాన నిధి పెట్టాను.వాటి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతుంటే ఆనందపడ్డాను. అందుకే చిన్న సినిమా అయినా, ఈ సినిమా ఆడియోకు వచ్చాను''అని ఆయన చెప్పారు.అంతే తప్ప రామానాయుడు సినిమా ప్రతిపాదనకు మాత్రం స్పందించలేదు.దాంతో రామానాయుడు చిన్నబుచ్చుకున్నారు.

    English summary
    Dr.D Ramanaidu said that he wish to make a film with Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X