రాజశేఖర్‌తో శ్రీయ రొమాన్స్.. కన్ఫర్మ్ చేసేశారు

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ తన తర్వాతి సినిమాను వీరభద్రం చౌదరి దర్శకత్వంలో చేయబోతున్నారు. విలక్షణ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈయన ఈ సారి ఓ వైవిద్యభరితమైన కథతో సిద్దమవుతున్నారట. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుందని తెలుస్తోంది.

అయితే చిత్రంలో రాజశేఖర్ సరసన నటించేందుకు గాను పలువురు సీనియర్ హీరోయిన్స్ పేర్లు పరిశీలించిన చిత్రయూనిట్ చివరకు శ్రీయను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు కూడా అయ్యాయని, కథ విన్న శ్రీయ వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. ఓ వైపు హుందాగా, మరోవైపు గ్లామర్‌నూ ఒలికించే పాత్ర కాబట్టి శ్రియ, న్యాయం చేస్తుందని అంతా భావిస్తున్నారు.

Dr. Rajasekhar romance with Shriya Saran

ఇకపోతే ఈ వెటరన్ బ్యూటీ శ్రీయ.. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటించే చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సో శ్రీయ సెకండ్ ఇన్నింగ్స్ ఇక టాప్ స్టార్ హీరోలతో సాగనుందని స్పష్టమవుతోంది.

మరో వైపు రాజశేఖర్‌ ఖాతాలో 'గరుడవేగ' హిట్ తరువాత 'కల్కి' రూపంలో డిజాస్టర్ పడింది. దీంతో కాస్తంత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్.. తన తదుపరి సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు 'అహ నా పెళ్ళంట', 'పూలరంగడు' సినిమాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం చౌదరికి తన తదుపరి సినిమా బాధ్యతలను అప్పగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X