»   » పూరీ ఇంటరాగేషన్.. 12 కాదు.. 16 మంది.. జగన్నాథుడు చెప్పిన ఆ నలుగురు వారేనా?

పూరీ ఇంటరాగేషన్.. 12 కాదు.. 16 మంది.. జగన్నాథుడు చెప్పిన ఆ నలుగురు వారేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఎక్సైజ్ శాఖ చేపట్టిన విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చినట్టు తెలుస్తున్నాయి. ఇప్పటి వరకు పోలీసులకు తెలిసిన పేర్లు కాకుండా తెలియన చాలా పేర్లు పూరీ బయటపెట్టడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసినట్టు సమాచారం. తొలి దఫా విచారణ తర్వాత మరికొందరికి నోటీసులు జారీ చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడిసున్నాయి.

డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఎక్సైజ్ శాఖ చేపట్టిన విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చినట్టు తెలుస్తున్నాయి. పోలీసులు ఊహించిన దానికంటే ఎక్కువగానే డ్రగ్ మాఫియా హైదరాబాద్‌లో వేళ్లూనుకుపోయింది. విచారణ సందర్భంగా తొలుత ప్రశ్నలను దాటవేయాలని పూరీ జగన్నాథ్ ప్రయత్నించినప్పటికీ.. పోలీసులు ఆధారాలు చూపడంతో అసలు విషయాన్ని కక్కాల్సి వచ్చిందని ప్రముఖ పత్రికల కథనం. అయితే ఇప్పటి వరకు పోలీసులకు తెలిసిన పేర్లు కాకుండా తెలియన చాలా పేర్లు పూరీ బయటపెట్టడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసినట్టు సమాచారం. తొలి దఫా విచారణ తర్వాత మరికొందరికి నోటీసులు జారీ చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడిసున్నాయి.

 మీడియాలో రేకెత్తిన ఉత్కంఠ

మీడియాలో రేకెత్తిన ఉత్కంఠ

బుధవారం నాటి పూరీ విచారణ అంశంపై మీడియా వెల్లడించిన కథనాలు ప్రజల్లో ఉత్కంఠను రేకెత్తించాయి. చాలా మంది వెబ్‌సైట్లను, టెలివిజన్ ఛానెళ్లకు అత్తుకుపోయారు. పలు చానెళ్లు నిరాటంకంగా ప్రత్యేకంగా వార్తా కథనాలను ప్రసారం చేశాయి. ఈ తంతు అంతా రాత్రి 11 గంటల వరకు సాగింది. మీడియా కథనాలపై పూరీ జగన్నాథ్ మనస్తాపం చెందిన సంగతి తెలిసిందే.

అధికారుల చిట్టాలో మరికొందరి పేర్లు

అధికారుల చిట్టాలో మరికొందరి పేర్లు

బుధవారం నాటి విచారణలో అధికారుల చిట్టాలో ఉన్న పేర్లు కాకుండా మరికొందరి పేర్లను వెల్లడించినట్టు తెలుస్తున్నది. కొత్తగా పేర్లు తెరమీదకు రావడంతో తదుపరి చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ ప్రతిష్ఠకు భంగంగా మారిన డ్రగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండటంతో అధికారులు కూడా సీరియస్‌గా స్పందిస్తున్నట్టు తెలుస్తున్నది.

దేశవ్యాప్తంగా అక్రమ డ్రగ్ దందా

దేశవ్యాప్తంగా అక్రమ డ్రగ్ దందా

టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డ్రగ్ అక్రమ దందా గట్టురట్టు అవుతున్నది. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా జోరుగా సాగుతున్నట్టు తాజా అరెస్టులతో వెల్లడవుతున్నది. కెల్విన్ విచారిస్తున్న నేపథ్యంలో మరిన్నీ అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తున్నది.

కెల్విన్ అరెస్ట్‌తో డ్రగ్ గుట్టురట్టు

కెల్విన్ అరెస్ట్‌తో డ్రగ్ గుట్టురట్టు

కెల్విన్ అరెస్ట్ తర్వార డ్రగ్ కేసు వ్యవహారంపై దర్యాప్తు ఊపందుకొన్నది. పూరీని విచారించిన సందర్భంగా కొత్తగా తెరపైకి వచ్చిన పేర్లపై పోలీసు దృష్టిపెట్టినట్టు సమాచారం. డ్రగ్స్ రొచ్చులో మరికొంత మంది టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్టు స్పష్టమవుతున్నది. మరోసారి అధికారులు కఠిన చర్యలుకు సిద్ధమవుతున్నారు. జ్యోతిలక్ష్మీ ఆడియోలో కెల్విన్ కనిపించడం పూరీకి వారితో సన్నిహిత సంబంధాలున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సినీ పెద్దలను తప్పించారు..

సినీ పెద్దలను తప్పించారు..

అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సినీ పెద్దలను తప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తన విచారణకు ముందు కొందరి పేర్లను వెల్లడించినట్టు వార్తలు రావడంతో పూరీ స్పందించాడు. అయితే తాను ఎవరి పేర్లను గానీ, ఏ విషయంపై గానీ మీడియాతో మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశాడు.

పూరీ చెప్పిన పేర్లు ఎవరివి..

పూరీ చెప్పిన పేర్లు ఎవరివి..

డ్రగ్ వ్యవహారంలో సురేశ్ బాబు తనయుడు అభిరామ్, మంచు విష్ణు, మరో ఇద్దరు సినీ ప్రముఖుల పేర్లు మీడియాలో వచ్చాయి. అయితే నోటీసులు వారికి పంపడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్మాత సురేశ్ బాబు కూడా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. అయితే తాజా విచారణలో పూరీ చెప్పిన పేర్లు ఎవరివనే ఆసక్తి అందరిలో నెలకొన్నది.

English summary
Investigation of Drug links with Tollywood is moving with fast manner. Officials are interogating the Drug supplier Kelvin in their custody. Reports suggest that Kelvin has told many interesting and shocking things to officials. Repots suggest that Puri Jagannadh revealed new things in drug case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu