»   » భయపడిన శ్రీదేవి, మద్యం సేవించి హోటల్ రూముకు వచ్చిన నటుడు!

భయపడిన శ్రీదేవి, మద్యం సేవించి హోటల్ రూముకు వచ్చిన నటుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మరణం అభిమానులను శోక సముద్రంలోకి నెట్టింది. దీనికి తోడు ఆమె మరణం వెనక అనేక అనుమానాలు, విభిన్న కథనాలు దుబాయ్‌లో అసలు ఏం జరిగిందో తెలియని అయోమయ పరిస్థితి. రెండు మూడు రోజులుగా శ్రీదేవి జ్ఞాపకాలతో గడుపుతున్న వారంతా... శ్రీదేవి కెరీర్లో చోటు చేసుకున్న పలు సంఘటలను గుర్తు చేసుకుంటున్నారు. బాలీవుడ్లో వివాదాస్పద నటుడిగా పేరు తెచ్చుకున్న సంజయ్ దత్ కు సంబంధించిన ఓ ఇన్సిడెంట్ ఇటీవల హాట్ టాపిక్ అయింది.

షాకింగ్ సంఘటన

షాకింగ్ సంఘటన

సౌత్‌ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేశారు. అక్కడ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. హిమ్మత్‌వాలా సినిమాలో జితేంద్రతో కలిసి ఆమె నటించిన సమయంలో ఓ షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది.

తప్పతాగి వచ్చిన సంజయ్ దత్

తప్పతాగి వచ్చిన సంజయ్ దత్

హిమ్మత్‌వాలా షూటింగ్ సమయంలో సంజయ్ దత్ ఆమె బస చేసిన హోటల్ రూముకు సడెన్‌గా వచ్చాడు. ఆ సమయంలో బాగా మద్యం సేవించిన సంజయ్ దత్ హోటల్ దద్దరిల్లిపోయేలా డోర్ పదే పదే కొట్టాడట.

భయపడిపోయిన శ్రీదేవి

భయపడిపోయిన శ్రీదేవి

సంజయ్ దత్ పదే పదే డోర్ కొట్టడంతో శ్రీదేవి భయపడిపోయింది. భయపడుతూనే బలవంతంగా డోర్ తీసిందట. ఆమె డోర్ తీయగానే సంజయ్ దత్ నేరుగా వెళ్లి శ్రీదేవి రూములోని బెడ్ మీద పడిపోయాడట.

సంజయ్ దత్ వచ్చింది అందుకే

సంజయ్ దత్ వచ్చింది అందుకే

సంజయ్ దత్ ఆ రోజు శ్రీదేవి రూముకు ఎందుకు వచ్చాడని ఆరాతీస్తే.... తన సినిమాలో హీరోయిన్‌గా నటించాలని రిక్వెస్ట్‌గా అడిగేందుకే వచ్చాడని తేలింది. కనీసం తనతో ఒక్క సినిమా అయినా చేయాలని వేడుకున్నాడట.

కఠిన నిర్ణయం తీసుకున్న శ్రీదేవి

కఠిన నిర్ణయం తీసుకున్న శ్రీదేవి

సంజయ్ దత్ ప్రవర్తనతో భయపడిపోయిన శ్రీదేవి.... తన కెరీర్లో ఎన్నడూ అతడితో కలిసి పని చేయకూడదని నిర్ణయించుకుందట. అప్పట్లో ఈ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ అయింది.

English summary
Sridevi entered Bollywood after attaining stardom in South and during the shooting of Himmatwala along with Jeetendra, she had a shocking experience. During that time Sanjay Dutt came to Sridevi's hotel room suddenly and started knocking the door uninterruptedly. Sridevi was forced to open the door and was scared like hell as Sanjay Dutt was inebriated and fell on her bed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu