»   »  ‘ఫాదర్స్ డే స్పెషల్’ కొడుకుతో వెంకీ (ఫోటోలు)

‘ఫాదర్స్ డే స్పెషల్’ కొడుకుతో వెంకీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ఫాదర్స్ డే' (జూన్ 15)ను పురస్కరించుకుని వెంకటేష్ తన కొడుకు అర్జున్‌తో కలిసి 'దృశ్యం' మూవీ కాంటెస్టును మొదలు పెట్టారు. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందుకు సంబంధించిన వివరాలు క్రొంద పేర్కొనబడ్డాయి.

నాన్నంటే నడిచే దైవం అంటారు. మనకు జన్మనిచ్చిన తల్లి గొప్పతనం ఒక వైపైతే...కష్టాలంటే ఏంటో తెలియకుండా మనల్ని పెంచే నాన్న గొప్పతనం మరో వైపు. అమ్మ జన్మనిస్తే నాన్న బతుకునిస్తాడు. ఈ ప్రపంచంలో కులమైనా, ఏ మతమైనా ఏ ప్రాంతమైనా, ప్రతి తండ్రి బతికేది తమ పిల్లల భవిష్యత్తు కోసమే! వారి భవిష్యత్ కోసం తండ్రి ఎంతైనా కష్టపడతాడు, ఎంత దూరమైనా వెళ్తాడు, తప్పటడుగులు వేసే బిడ్డని లోకానికి పరిచయం చేస్తాడు తండ్రి. అలాంటి ఒక తండ్రి కథతో రూపొందించిన సినిమానే 'దృశ్యం'.

మొదటి సారిగా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఇద్దరు పిల్లల తండ్రిగా నటిస్తున్నాడు. తన భార్య పిల్లలే తన లోకమని బతుకుతున్న ఒక తండ్రి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే ఈ 'దృశ్యం'. చిన్న తనంలో ప్రతి ఒక్కరికీ తమ నాన్నే తమ హీరో. తన జీవితంలో ఎన్నికష్టాలున్నా...వాటన్నింటినీ ఎదుర్కొని తమ సంతానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు నాన్న. ఈ ఫాదర్స్ డే(జూన్ 15) సందర్భంగా టీమ్ 'దృశ్యం' జన్మనిచ్చిన తండ్రికి వందనాలు సమర్పిస్తోంది.

మన తల్లిదండ్రులను, మన జీవన సహచరులను ప్రేమించడానికి ఒక ప్రత్యేక దినం వసరముందా అని చాలా మంది అడగొచ్చు...కానీ మానవ సంబంధాలు దూరమవుతున్న ఈ రోజుల్లో కనీసం ఈ ర ోజైనా నాన్న గొప్పతనాన్ని స్మిరంచుకోవడంలో తప్పేమీ లేదు.

ఈ ఫాదర్స్ డే సందర్భంగా 'దృశ్యం' టీం 'మై డాడ్..మై హీరో' పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. మీలో ఎవరైనా మీ నాన్నే మీ హీరో అనుకుంటున్నారా? మీ నాన్న మీలో స్ఫూర్తి రగిలించిన సంఘటనలేమైనా ఉన్నాయా? అయితే #myDadMyHero మరియు #Drishyam హ్యాష్ టాగ్ తో ట్విట్టర్ లేదా ఫేస్ బుక్‌లో మీ అనుభవాలను షేర్ చేసుకోండి. లేదా drishyam.telugu@gmail.com కి మెయిల్ చేయండి. మీరు పంపించిన వాటిలో ఉత్తమ కథనాలను దృశ్యం టీం నుంచి బహుమతులు గెలుచుకోవడమే కాకుండా వెంకటేష్ గారిని స్వయంగా కలుసుకునే అవకాశం కూడా ఉంది.

దృశ్యం

దృశ్యం


ఫాదర్స్ డేను పురస్కరించుకుని కొడుకు అర్జున్‌‍తో కలిసి ‘దృశ్యం' సినిమా ప్రమోషన్స్ ప్రారంభించిన వెంకటేష్.

మీ నాన్న గురించి

మీ నాన్న గురించి


మీ నాన్న గురించిన అభిప్రాయాలను ఇక్కడ ఫోటోలో ఉన్న హ్యాష్ ట్యాగ్ ద్వారా సోషల్ నెట్వర్కింగులో షేర్ చేసుకోండి.

మీనా, వెంకటేష్

మీనా, వెంకటేష్


హైదరాబాద్ లో జరిగిన ‘దృశ్యం' మూవీ ప్రెస్ మీట్లో వెంటేష్, మీనా

రామానాయుడు, పరుచూరి బ్రదర్స్

రామానాయుడు, పరుచూరి బ్రదర్స్


హైదరాబాద్ లో జరిగిన ‘దృశ్యం' మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత రామానాయుడు, పరుచూరి బ్రదర్స్.

మనవడితో తాత

మనవడితో తాత


తన మనవడు దగ్గుబాటి అభిరాంతో కలిసి దృశ్యం మూవీ ప్రెస్ మీట్‌కు హాజరవుతున్న రామానాయుడు.

ఝాన్సీ సందడి

ఝాన్సీ సందడి


‘దృశ్యం' సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి యాంకర్ ఝాన్సీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ప్రమోషన్స్ దృశ్యాలు...

ప్రమోషన్స్ దృశ్యాలు...


దృశ్యం మూవీ ప్రమోషన్స్‌కు సంబంధించిన దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు.

నదియా

నదియా


దృశ్యం మూవీ ప్రమోషన్స్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న నదియా, నరేష్

ప్రమోషన్స్ దృశ్యాలు...

ప్రమోషన్స్ దృశ్యాలు...


దృశ్యం మూవీ ప్రమోషన్స్‌కు సంబంధించిన దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు.

ప్రమోషన్స్ దృశ్యాలు...

ప్రమోషన్స్ దృశ్యాలు...


దృశ్యం మూవీ ప్రమోషన్స్‌కు సంబంధించిన దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు.

దృశ్యం మూవీ స్టిల్స్

దృశ్యం మూవీ స్టిల్స్


దృశ్యం సినిమాకు సంబంధించిన స్టిల్స్

దృశ్యం మూవీ స్టిల్స్

దృశ్యం మూవీ స్టిల్స్


దృశ్యం సినిమాకు సంబంధించిన స్టిల్స్

దృశ్యం మూవీ స్టిల్స్

దృశ్యం మూవీ స్టిల్స్


దృశ్యం సినిమాకు సంబంధించిన స్టిల్స్

English summary
In its Golden Jubilee Year, Dr. D. Rama Naidu presents “DRUSHYAM”, A Suresh Productions, Raaj Kumar Theaters Pvt. Ltd. and Wide Angle Creations joint venture, with Victory Venkatesh and Meena in the titular roles and directed by Sri Priya, “DRUSHYAM” has completed shooting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu