పవన్‌ సాంగులో డిఎస్‌పి స్పెషల్ అప్పియరెన్స్

By Bojja Kumar

హైదరాబాద్ : తెర వెనక ఉండి పని చేసే దర్శకులు, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లు అప్పుడప్పుడూ సినిమాల్లో ఏదో సీన్లో లేదా సాంగులో.....స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలోని 'నిను చూడగానే' అనే సాంగులో పవన్ కళ్యాణ్, సమంతలతో కలిసి కనిపించనున్నారట దేవిశ్రీ. కాగా ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కావాల్సి ఉండగా సమైక్య ఉద్యమం కారణంగా విడుదల నిలిచి పోయింది.

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'అత్తారింటికి దారేది' చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాల మరింత పెరిగాయి.

ఈ చిత్రంలో నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X