»   » ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి నెక్ట్స్ మూవీ సెప్టెంబర్లో...

‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి నెక్ట్స్ మూవీ సెప్టెంబర్లో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

దుల్కర్‌ సల్మాన్‌, సాయిపల్లవి జంటగా నటించిన మలయాళ చిత్రం 'కలి'. ఈ చిత్రం తెలుగులో విడుదల కాబోతోంది. అనువాద హక్కులను డి.వి. కృష్ణస్వామి దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగు అనువాదానికి సంబంధించిన డబ్బింగ్‌, మిక్సింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మరో ప్రక్క తెలుగులో సాయి ప‌ల్ల‌వి కి మంచి డిమాండ్ ఏర్ప‌డ‌డంతో ఈ మ‌ల‌యాళీ బ్యూటీ కి చెందిన ఓ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ప్రముఖ డబ్బింగ్ స్టూడియోలో జరిగాయి. డివి కృష్ణ స్వామి నిర్మాతగా ఈ చిత్రం రెడీ అవుతోంది.

సెప్టెంబర్ రిలీజ్

సెప్టెంబర్ రిలీజ్

ఆగ‌స్ట్ రెండోవారంలో ఈ సినిమా టైటిల్, లోగో విడుద‌ల చేస్తారు. సెప్టెంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి

దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి

ఇటీవల విడుదలైన 'ఫిదా'తో సాయిపల్లవి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం ఆమె నానితో కలిసి 'ఎం.ఎల్‌.ఎ' చిత్రంలో నటిస్తున్నారు. 'ఓకే బంగారం'తో దుల్కర్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

గోపీసుంద‌ర్

గోపీసుంద‌ర్

ప‌లు ఉత్త‌మ చిత్రాల‌కు సంగీతం అందించి జాతీయ‌స్థాయిలో ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా అవార్డ్స్ అందుకున్న గోపీసుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్ నెల‌లో సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

Mega Hero Varun Tej About Sai Pallavi
కలి

కలి

ఈ చిత్రానికి మాట‌లుః భాషా శ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ‌, సంగీతంః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః గిరీష్ గంగాధ‌ర‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ద‌క్షిణ్ శ్రీనివాస్‌, కో ప్రొడ్యూస‌ర్ః వి.చంద్ర‌శేఖ‌ర్‌, నిర్మాతః డి.వి.కృష్ణ‌స్వామి, ద‌ర్శ‌క‌త్వంః స‌మీర్ తాహిర్‌.

English summary
Dulquer Salmaan and Sai Pallavi starrer Malayalam film Kali was an enormous hit in both their careers and went on to bring a lot of recognition for Sai Pallavi.Kali is now being dubbed into Telugu and dubbed version rights have been acquired by DV Krishna Swamy and will be released on Lakshmi Chennakesava Films banner. The film's pooja held at Dubbing studio at Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu