»   » 'హీరో విజయ్‌కు విడాకులు ఇవ్వను’ అని తేల్చి చెప్పింది

'హీరో విజయ్‌కు విడాకులు ఇవ్వను’ అని తేల్చి చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
బెంగళూరు : దునియా విజయ్ విడాకుల కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. తాజాగా విజయ్‌కు ఎలాంటి పరిస్థితిలో తాను విడాకులు ఇవ్వనని అతని భార్య నాగరత్న బెంగళూరు ఫ్యామిలీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం దునియా విజయ్, నాగరత్న దంపతులు విడాకుల కేసు విచారణకు వచ్చింది.

ఈ సందర్భంలో నాగరత్న తరుఫున ఆమె న్యాయవాది రెండు అర్జీలు న్యాయస్థానానికి సమర్పించారు. తన భర్తకు విడాకులు ఇవ్వనని నాగరత్న ఒక అర్జీలో తెలిపింది. మరొ అర్జీలో తన భర్త దూరం అయిన తరువాత తను జీవించడానికి చాలా కష్టంగా ఉందని కుటుంబ పోషణకు తన భర్త నుంచి నగదు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.

తన తల్లిని సరిగా చూసుకోవడం లేదని, బంధువులతో సఖ్యతగా లేనందున తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని నటుడు విజయ్ కోర్టులో అర్జీ సమర్పించారు. కేసు వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం జూలై రెండవ తేదికి కేసు వాయిదా వేసింది.

ఇక విజయ్... 'నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని ఆమె పేర రాసిచ్చా. దేశవిదేశాల నుంచి లెక్కలేనన్ని బంగారు ఆభరణాలు కొనిచ్చా. కోరినప్పుడల్లా షికార్లకు తిప్పా. ఆమె బంధువుల్లో కొందరికి అడిగిందే తడవుగా ఆర్థిక సాయం చేశా. ఎంతో ప్రేమను పంచిపెట్టా. ప్రతిగా ఆమె నాకేమిచ్చింది? నాపైనే ఆరోపణలు గుప్పించి కేసు పెట్టింది... 14 సంవత్సరాలుగా నరకం చూపింది. ఇక ఆమెతో కాపురం చేయడం నా వల్ల కాదు' అని విజయ్ వెల్లడించారు.

English summary
The divorce case of Sandalwood actor Duniya Vijay is attracting all the wrong attention. Sources say a new advocate represented the actor at Bangalore family court today. Apparently, this is the third advocate hired by Vijay to fight his divorce case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu