For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భార్య నరకం చూపిందంటూ...హీరో విజయ్ కన్నీళ్లు(ఫోటోలు)

  By Bojja Kumar
  |

  బెంగుళూరు : సంసారంలో ఆటు పోట్లు సామాన్య జనాల జీవితాల్లోనే కాదు...సినిమా వాళ్లకు కూడా ఉంటాయి. తాజాగా సంసార జీవితంలో సమస్యలతో సతమతం అవుతున్నాడు కన్నడ నటుడు 'దునియా' అనే కన్నడ మూవీ ఫేం విజయ్. భార్యతో విడాకులు ఇప్పించాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం.

  తాజాగా విజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి...తన భార్య నాగరత్న వల్ల తను అనుభవించిన నరకాన్ని, మనో వేదనను ఏకరువు పెట్టుకున్నారు. ఆమెకోసం ఎన్నో చేసాను...అయినా నన్ను మానసికంగా హింసించిందంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. 'నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని ఆమె పేర రాసిచ్చా. దేశవిదేశాల నుంచి లెక్కలేనన్ని బంగారు ఆభరణాలు కొనిచ్చా. కోరినప్పుడల్లా షికార్లకు తిప్పా. ఆమె బంధువుల్లో కొందరికి అడిగిందే తడవుగా ఆర్థిక సాయం చేశా. ఎంతో ప్రేమను పంచిపెట్టా. ప్రతిగా ఆమె నాకేమిచ్చింది? నాపైనే ఆరోపణలు గుప్పించి కేసు పెట్టింది... 14 సంవత్సరాలుగా నరకం చూపింది. ఇక ఆమెతో కాపురం చేయడం నా వల్ల కాదు' అని విజయ్ వెల్లడించారు.

  విజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి...తన భార్య నాగరత్న వల్ల తను అనుభవించిన నరకాన్ని, మనో వేదనను ఏకరువు పెట్టుకున్నారు.

  విజయ్ తో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తండ్రి రుద్రయ్య

  విజయ్ తో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న నారాయణమ్మ

  భార్యకు అడిగిందల్లా కొనిపెట్టా, చాలా అపురూపంగా చూసుకున్నా....కానీ ఆమె నాకు 14 సంవత్సరాలుగా నరకం చూపింది. ఇక ఆమెతో కాపురం చేయడం నా వల్ల కాదన్నారు

  ప్రస్తుతం విజయ్ ‘రజనీకుంత' అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.

  అదే విధంగా తన భార్య చేసిన ఆరోపణలను సైతం ఖండించారు. తుపాకీతో కాల్చేస్తానని తాను ఏనాడూ ఆమెను బెదిరించలేదన్నారు. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. తమ మధ్య రాజీ కుదిర్చేందుకు కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారని, అయితే పరిస్థితి ఇప్పుడు పూర్తిగా చేయిదాటిపోయిందని విజయ్ చెప్పారు. విడాకుల విషయంలో కోర్టులోనే తేల్చుకుంటానన్నారు. బిడ్డలను కూడా తనకే అప్పగించాలని కోర్టును కోరతానన్నారు.

  అయితే...నాగరత్న వాదన వేరేలా ఉంది. . గతంలోనే విజయ్‌కు పెళ్లయిందని, ఆమె వదిలి వెళ్లడంతో తనను ఇష్టపడి వివాహం చేసుకున్నాడని తెలిపారు. సంసారం సుఖంగా కొనసాగుతున్న సమయంలో మూడేళ్ల క్రితం నటి శుభపూంజాను వర్ధమాన నటిని వివాహం చేసుకున్నారని దానికి కూడా అడ్డుచెప్పలేదని అన్నారు. కత్రిగుప్పలో నిర్మించిన ఇంటి గృహ ప్రవేశం సమయంలో కూడా తనతో పాటు ఆ శుభపూంజా కూడా పూజలు, హోమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఛాయాచిత్రాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. 'శుభను వివాహం చేసుకున్నాను. అభ్యంతరం చెప్పకూడదని విజయ్‌ చేసిన ఆదేశాల్ని పాటించానని' నాగరత్న తెలిపారు. ఇప్పుడిలా విడాకులిస్తానంటూ చెబుతున్నారని వాపోయారు. ప్రాణం పోయినా విడాకులకు అంగీకరించేది లేదని ఆమె స్పష్టం చేశారు. సంసారంలో చిన్నచిన్న కలతలు సహజమేనన్నారు. వాటిని పరిష్కరించుకుంటానని చెప్పారు.

  English summary
  Duniya Vijay addressed the media after being in the news for wrong reasons in the recent past. The actor organised a press meet on Wednesday (January 31) to talk about his divorce issue and his forthcoming film Rajani Kantha. However, the actor chose to speak more of his film than about his personal life.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X