»   » ‘జన సేన’ సభలో నకిలీ గబ్బర్ సింగ్ (ఫోటోలు)

‘జన సేన’ సభలో నకిలీ గబ్బర్ సింగ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

విశాఖ: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో తలపెట్టిన 'జనసేన' బహిరంగ సభలో నకిలీ గబ్బర్ సింగ్ వేషధారి ఆకట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ మాదిరి హావ భావాలు ప్రదర్శిస్తూ ఆయన మాదిరి సినిమా పాటలకు స్పెట్స్ వేస్తూ అభిమానులను అలరించారు.

జన సేన సభకు హాజరయ్యేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వివిధ ప్రాంతాల నుండి గురువారం ఉదయమే ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకున్నారు. అయితే సాయంత్రం 7.20 నిమిషాలకు గానీ పవన్ కళ్యాణ్ ప్రసంగం మొదలైంది. ఈ గ్యాపులో పలువురు గాయకులు, ఆర్కెస్ట్రా కళాకారులు స్టేడియంకు వచ్చిన అభిమానులకు వినోదం పంచారు.

నకిలీ గబ్బర్ సింగ్ ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి......

విశాఖ సభలో నకిలీ గబ్బర్ సింగ్....

విశాఖ సభలో నకిలీ గబ్బర్ సింగ్....

విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన సభలో నకిలీ గబ్బర్ సింగ్ తన విన్యాసాలతో ఆకట్టుకున్నాడు.

ఫ్యాన్స్ ఆసక్తి...

ఫ్యాన్స్ ఆసక్తి...

రియల్ పవన్ కళ్యాణ్ మాదిరి హావ భావాలు ప్రదర్శిస్తుండటంతో నరికీ గబ్బర్ సింగ్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపారు.

పవన్ కెరీర్లో గబ్బర్ సింగ్ మైలురాయి

పవన్ కెరీర్లో గబ్బర్ సింగ్ మైలురాయి

పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం భారీ విజయం సాధించి ఆయన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే.

గబ్బర్ సింగ్ 2

గబ్బర్ సింగ్ 2

గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించడంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా గబ్బర్ సింగ్ 2 చిత్రం కూడా ప్లాన్ చేసారు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు.

జనసేన పార్టీతో గబ్బర్ సింగ్ 2 ఆలస్యం

జనసేన పార్టీతో గబ్బర్ సింగ్ 2 ఆలస్యం

వాస్తవానికి ‘గబ్బర్ సింగ్ 2' చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో ఆలస్యం అయింది. ఇటీవల ఆ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభమైంది. అయితే జనసేన పార్టీ స్థాపన, పవన్ కళ్యాణ్ ఎన్నిక హడావుడిలో ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

English summary
Duplicate Gabbar Singh at Jana Sena meeting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu