»   » ఆ కోరల్లోంచి బయపడిన దువ్వాడ జగన్నాథం.. బన్నీ కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్ అట..

ఆ కోరల్లోంచి బయపడిన దువ్వాడ జగన్నాథం.. బన్నీ కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్ అట..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రం విడుదలకు ముందు అనేక వివాదాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ పాట తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ ఇటీవల బ్రహ్మణ సంఘాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు, తదితరులకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో డీజే సెన్సార్ ఎలా ఉంటుందోననే ఆందోళన చిత్రయూనిట్‌కు తలెత్తింది. అయితే దువ్వాడ జగన్నాథం చిత్రం ఎలాంటి ఇబ్బందుల్లేకుండా బయటపడినట్టు సమాచారం.

  డీజే సెన్సార్ క్లియర్..

  డీజే సెన్సార్ క్లియర్..

  వివాదాలు చుట్టుముట్టిన దువ్వాడ జగన్నాథం చిత్రానికి ఇటీవల సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా డీజేపై ప్రశంసలు కూడా కురిపించారట. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తయినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఇక దువ్వాడకు ఎలాంటి వివాదాల ముప్పు లేకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


  బ్లాక్‌బస్టర్ హిట్ అట..

  బ్లాక్‌బస్టర్ హిట్ అట..

  ఎలాంటి సమస్యలు లేకుండా డీజే సెన్సార్ నుంచి బయటపడటంతో నిర్మాత ఆత్మవిశ్వాసం రెండింతలైందట. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. డీజే చిత్రం బన్నీ కెరీర్‌లోనే కనివిని ఎరుగని రీతిలో హిట్‌గా నిలుస్తుందనే ప్రస్తుతం టాక్.


  అల్లు అర్జున్, పూజా కెమిస్ట్రీ..

  అల్లు అర్జున్, పూజా కెమిస్ట్రీ..

  దువ్వాడ జగన్నాథానికి సంబంధించి క్లైమాక్స్ అదిరిపోయిందనే సెన్సార్ రిపోర్ట్. హీరోయిన్ పూజా హెగ్డే, అల్లు అర్జున్ మధ్య లవ్ ట్రాక్ సూపర్‌గా ఉందనే మాట వినిపిస్తున్నది. వారిద్దరి కెమిస్ట్రీ వర్కవుట్ అయిందని, స్క్రీన్‌పై మ్యాజిక్ ఖాయమంటున్నాయి సినీ వర్గాలు. ఇప్పటికే డీజే పాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యూట్యూబ్‌లో పలు పాటలకు అభిమానులు డ్యాన్సులు చేసి వీడియోలు పెడుతున్నారు.


  దువ్వాడపైనే ఆశలు...

  దువ్వాడపైనే ఆశలు...

  ఇక దువ్వాడ జగన్నాథం చిత్రంపై హీరోయిన్ పూజా హెగ్డే భారీ ఆశలు పెట్టుకొన్నది. ఈ చిత్రం హిట్‌గా నిలుస్తే దక్షిణాదిలో పాగా వేయడానికి ఆమెకు మార్గం సులభమవుతుంది. తెలుగులో ఇంతకు ముందు నటించిన ఒక లైలా కోసం, ముకుంద చిత్రాలు పెద్దగా ఆడలేదు. దాంతో పూజా హెగ్డేకు సక్సెస్ అనేది అందని ద్రాక్షగానే మారింది. ఒకవేళ డీజే బ్లాక్‌బస్టర్ అయితే పూజ పంటపడింనట్లే అనే మాట ఫిలింనగర్‌లో వినిపిస్తున్నది.


  బాలీవుడ్‌లోనూ నిరాశే..

  బాలీవుడ్‌లోనూ నిరాశే..

  హిందీలో పూజా హెగ్డే నటించిన చిత్రాలు కూడా అంతగా విజయం సాధించిన రికార్డుల లేదు. హృతిక్ రోషన్‌తో పూజ నటించిన మెహంజదారో చిత్రం బాక్సాఫీస్‌పైనా బోల్లాపడింది. ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్‌లోనూ పెద్దగా అవకాశాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో దువ్వాడ జగన్నాథం చిత్రంపై పూజ కొండంత ఆశను పెట్టుకొన్నది.  English summary
  Stylish Star Allu Arjun is back with his upcoming movie Duvvada Jagannadham which has been told to be a stylish action entertainer. Harish Shankar directed the movie which wrapped up all the post-production formalities. Duvvada Jagannadham completed censor scrutiny recently. The makers are pretty confident on the film which is said to be the biggest ever release among Bunny’s films. Pooja Hegde played the female lead and Dil Raju produced DJ which brought enough table profits prior to the release. Duvvada Jagannadham is all set for June 23rd release all over.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more