»   » ‘డిజే’ ట్రైలర్ సరికొత్త రికార్డ్, బాహుబలి తర్వాత ఇదే...

‘డిజే’ ట్రైలర్ సరికొత్త రికార్డ్, బాహుబలి తర్వాత ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెడ్గే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన దువ్వాడ జగన్నాధమ్(డిజె) ట్రైలర్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 7.4 మిలియన్ వ్యూస్ సాధించింది. యూట్యూబ్, ఫేస్ బుక్‌లో కలిసి ఇంత భారీ రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి తర్వాత అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ గా సౌతిండియా రికార్డ్ నమోదు చేసింది.

ట్రైలర్ విషయంలో ఇంత రెస్పాన్స్ రావడం, సినిమాపై అంచనాలు మరింత పెరగడంతో బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.


డిజే

డిజే

డిజె చిత్రాన్ని జూన్ 23న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై ఇటీవల ఓ వివాదం తెరపైకి రాగా.... దాన్ని క్లియర్ చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.


హరీష్ శంకర్

దర్శకుడు హరీష్ శంకర్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. గబ్బర్ సింగ్ తర్వాత ఆయన మల్లీ ఆ రేంజి హిట్ కొట్టలేదు. ఈ సినిమాతో మళ్లీ తన సత్తా ఏమిటో నిరూపించుకుంటాననే కసితో ఈ సినిమా చేసారు.


దిల్ రాజు

దిల్ రాజు

ఇక హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో అందుకు తగిన విధంగానే సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


డిజే వివాదం: తగ్గిన హరీష్ శంకర్, పదాలను తొలగిస్తామని హామీ!

డిజే వివాదం: తగ్గిన హరీష్ శంకర్, పదాలను తొలగిస్తామని హామీ!

డిజే సినిమా గురించిన వివాదం, సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాల కోసం క్లిక్ చేయండి.English summary
Allu Arjun's Duvvada Jagganadham trailer is breaking records! Within 24 hours of being released online, the trailer of the Harish Shankar-directorial has clocked a whopping 7.4 million views on YouTube and Facebook together. This is the highest for a film in south India after Baahubali: The Conclusion!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu