twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లేడి నిర్మాతకు బెదిరింపు కాల్స్.. వివాదంగా మారిన సాంగ్, తెలంగాణ ఎమ్మెల్యే రంగంలోకి!

    |

    ఈ శుక్రవారం మూడు చిత్రాలు తెలుగు తెరపైకి వచ్చాయి. విక్రమ్ నటించిన సామి, సుధీర్ బాబు నన్ను దోచుకుందువటేతో పాటు చిన్న చిత్రం వచ్చిన ఈ మాయ పేరేమిటో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మాయ పేరేమిటో చిత్రం వివాదం చిక్కుకుంది. ఈ చిత్రంలోని ఓ పాట హిందువుల మనోభావాలకు వ్యతిరేంగా ఉందని వివాదం మొదలయింది. ఆ వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం.

    మనోభావాల్ని కించపరిచేలా

    మనోభావాల్ని కించపరిచేలా

    ఈ చిత్రం నిన్న విడుదల కాగానే తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. ఈ చిత్రంలోని అరిహంతానం అనే పాట హిందువుల మనోభావాల్ని కించేపరిచేలా ఉందని ఆయన సెన్సార్ చైర్మన్ జోషికి లేఖ రాశారు. ఆ లేఖ ఆయనకు అందింది.

    తొలగించాలని

    తొలగించాలని

    ఆపాటలో ఉన్న వివాదాస్పద లిరిక్స్ ని తొలగించాలని నెల రోజుల క్రితమే హెచ్చరించినట్లు రాజా సింగ్ తెలిపారు. అయినా కూడా సినిమాని అదే విధంగా విడుదల చేశారని రాజాసింగ్ మండిపడ్డారు. చాలా మంది నుంచి ఈ పాట తొలగించాలనే డిమాండ్ ఎక్కువవుతోంది.

     స్పందించిన నిర్మాత

    స్పందించిన నిర్మాత

    ఈ మాయ పేరేమిటో చిత్రంలో సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా నటించాడు. ఆయన కుమార్తె దివ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. పాట వివాదం కాగానే ఆ లిరిక్స్ వచ్చిన సమయంలో మ్యూట్ చేసినట్లు తెలిసింది. సమస్యని పరిష్కరించాక కూడా ఎందుకు వివాదం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

    బెదిరింపు కాల్స్

    బెదిరింపు కాల్స్

    వివాదాస్పద లిరిక్స్ వద్ద మ్యూట్ లో ఉంచి ప్రదర్శిస్తున్నాం. అయినా కూడా నాకు కొందరి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అంతే కాకుండా తన ఫోన్ నంబర్ ని సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారని ఆమె వాపోయారు.

    English summary
    Ee Maaya Peremito movie lands in controversy. Here is the details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X