»   » చెత్త సినిమాలకు దూరంగా ఉండండి: ‘ఈ నగరానికి ఏమైంది?’ వింత ప్రమోషన్స్

చెత్త సినిమాలకు దూరంగా ఉండండి: ‘ఈ నగరానికి ఏమైంది?’ వింత ప్రమోషన్స్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  చెత్త సినిమాలకు దూరంగా ఉండండి: ‘ఈ నగరానికి ఏమైంది?’ వింత ప్రమోషన్స్

  ఫిల్మ్ మేకర్స్ అంటేనే క్రియేటివ్ పర్సన్స్. అలాంటి వారు మరింత క్రియేటివ్‌గా సినిమాను ప్రమోట్ చేస్తే... పబ్లిసిటీ అదిరిపోతుంది. తాజాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'ఈ నగరానికి ఏమైంది?' సినిమా ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ఓ వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మనం ప్రతి రోజూ థియేటర్లో చూసే రాహుల్ ద్రావిడ్ నో స్మోకింగ్ యాడ్ థీమ్‌తో ఈ ప్రమోషనల్ వీడియో రూపొందించారు. చెత్త సినిమాలకు దూరంగా ఉండండి, చెత్త సినిమాలు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం, మరియు ప్రాణాంతకం అంటూ సాగే ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో అభినవ్ నటించారు.

  చెత్త సినిమాలు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం

  చెత్త సినిమాలు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం

  ‘ఒక సినిమా ప్రేమికుడిగా నేను ప్రతి సినిమాను ఫ్రైడే మా గ్యాంగ్ తో కలిసి ఎంజాయ్ చేద్దామనుకుంటాను. కానీ ప్రతి ఫ్రైడే మంచి సినిమాలు రావు. అలాంటి సినిమాలు మనలో సినిమా చూసే ఆసక్తిని, ఉత్సాహాన్ని నాశనం చేస్తాయి. చెత్త సినిమాలు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం, మరియు ప్రాణాంతకం. ముఖ్యంగా మీరు డబ్బులు పెట్టే విషయంలో కూడా. ఒక ఉత్సాహభరితమైన సినిమా చూసి ఎంజాయ్ చేయాలంటే చెత్త సినిమాలకు దూరంగా ఉండండి. అందుకే నేను ఈ వీక్ విడుదలవుతున్న ‘ఈ నగరానికి ఏమైంది?' అనే సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. మీరూ అలాగే చేయండి. మీ గ్యాంగుతో కలిసి థియేటర్ కు రండి.' అంటూ ఈ వీడియోలో అభినవ్ చెప్పడం క్రియేటివ్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  మీ గ్యాంగ్ లో మీ పరువు నిలబడాలంటే

  మీ గ్యాంగ్ లో మీ పరువు నిలబడాలంటే

  కష్టపడి లైన్లో నిల్చుని టిక్కెట్లు కొన్నాక ఆ సినిమా బావుండాలని అనుకుంటారు. ఎందుకంటే ఆ సినిమా బాగోలేకుంటే మీరూ, మీ గ్యాంగ్ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి రావొచ్చు. ఒక చెత్త సినిమాకు తీసుకెళ్లడం వల్ల మీ గ్యాంగ్ లో మీ పరువును కోల్పోకండి. చక్కగా ఉండండి. చెత్త సినిమలకు దూరంగా ఉండండి. మీ గ్యాంగ్ లో మీ పరువు నిలబడాలంటే ఈ సినిమాకు మీ గ్యాంగ్ తో రండి.... అంటూ ఇందులో పేర్కొననారు.

   తరుణ్ భాస్కర్ మూవీ

  తరుణ్ భాస్కర్ మూవీ

  'పెళ్లి చూపులు' సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హైలెట్ అయ్యాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుండి వస్తున్న రెండో మూవీ 'ఈ నగరానికి ఏమైంది'. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నలుగురు ఫ్రెండ్స్, మందు, సినిమా చుట్టూ తిరిగే కథ ఇది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంతో పాటు.... ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

  తన జీవిత అనుభవం నుండే...

  తన జీవిత అనుభవం నుండే తరుణ్ భాస్కర్ ఈ సినిమా కథ రాసుకున్నారు. నలుగురు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ప్రయాణం గురించి సినిమా సాగుతుంది. ఈ జర్నీలో వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, చివరకు ఎలా సక్సెస్ అయ్యారు అనేది కథ. జూన్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  English summary
  Ee Nagaraniki Emaindi Statutory Warning video superb. EeNagaranikiEmaindi is the second feature film of Tharun Bhascker who earlier directed the super hit film #Pellichoopulu. This film features new faces Vishwak Sen, Sai Sushanth, Abhinav Gomatam, Venkatesh Kakumanu, Anisha Ambrose and Simran Chowdary. The music for the film is by Vivek Sagar (Tapeloop), Production Design is by Latha Tharun, Cinematography by Niketh Bommireddy, Editing by Raviteja Girijala and Venkat Siddareddy is the Executive Producer.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more