Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'ఈడు గోల్డ్ ఎహే' సెన్సార్ పూర్తి - అక్టోబర్ 7 విడుదల
బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల, సునీల్ కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న విజయదశమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఆ వివరాలను నిర్మాత రామబ్రహ్మం సుంకర తెలియజేస్తూ - ''ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే నాలుగు పట్టణాల్లో విడుదలైన పాటలకు కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సునీల్ కెరీర్‌లో మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది. అలాగే మా బేనర్‌కి మరో మంచి కమర్షియల్ హిట్ సినిమా అవుతుంది. విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.

స్టార్ సునీల్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పునీత్ ఇస్సార్, డా|| నరేష్, అరవింద్, చరణ్, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్, షకలక శంకర్, ప్రభాస్, భరత్, అనంత్, రాజా రవీంద్ర, లంబోదర, మాస్టర్ అక్షిత్, నల్లవేణు, గిరిధర్, సుదర్శన్, విజయ్, జోష్ రవి, పి.డి.రాజు, పవన్, గణేష్, కోటేశ్వరరావు, జగన్, సత్తెన్న, అవంతిక, బేబి యోధ, లలిత, లక్ష్మి, శ్రీలేఖ, అశోక్ తలారి మిగతా పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దేవరాజ్, సంగీతం: సాగర్ ఎం. శర్మ, ఆర్ట్: వివేక్ అన్నామలై, ఫైట్స్: గణేష్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు పోట్ల.