»   »  ఈనాడు చిరు సర్వే??

ఈనాడు చిరు సర్వే??

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి రాజకీయ ప్రవేశంపై పత్రికలు, ఛానళ్లు కోడై కూస్తే ఈనాడు, ఈటీవీ మాత్రం కేవలం చిరంజీవి విడుదల చేసిన ప్రెస్ నోట్ ఆధారంగానే వార్త రాసింది. ఆ తరువాత కూడా చిరంజీవికి సంబంధించిన ఒక్క వార్తను కూడా ప్రచురణ కానీ,ప్రసారంకానీ చేయలేదు. ఇది ఆ పత్రిక స్టాండ్ అనుకోవచ్చు.కానీ తాజాగా ఒక వార్త ఫిల్మ్ నగర్ లో గుప్పుమంది. చిరంజీవి రాజకీయాలలోకి వచ్చే అంశంపై ఈనాడు పత్రిక సర్వే నిర్వహిస్తున్నట్టు ఆ వార్త సారాంశం. ఇప్పటికే ఆంధ్రజ్యోతి తన సర్వేలతో హడలగొట్టిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈనాడులో ఏం తేలనుందో వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈనాడు సర్వే చిత్తూరు, విజయనగరంలో జరుగుతున్నట్టు సమాచారం. ఈ సర్వే ప్రశ్నావళి 20 ప్రశ్నలతో రూపొందినట్టు తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X