అక్షయ్ కుమార్ అలా చేయడంతో చిరాకు పడ్డ అమితాబ్, ఏం జరిగింది?

By Bojja Kumar

బాలీవుడ్‌ షెహన్ షా అమితాబ్‌ బచ్చన్‌ 'ఇండియన్‌ ఫిలిం పర్స నాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు అందుకొన్న సంగతి తెలిసిందే. గోవాలో ఇటీవల ముగిసిన 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' ముగింపు వేడుకలో ఆయన్ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు.

ఈ వేడుకలో అమితాబ్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అవార్డు అందించారు. అవార్డు అందుకోవడానికి అమితాబ్‌ స్టేజీ మీదకు రాగానే అక్షయ్‌ వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించబోయారు. అప్పుడు అమితాబ్‌ వద్దు అంటూ ఆయన్ను పైకి లేపి ఆలింగనం చేసుకున్నారు. ఈ సంఘటనపై అమితాబ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

చిరాకు పడ్డ అమితాబ్

అక్షయ్‌ ఇలా చేయడంతో అమితాబ్‌కి చిరాకు కలిగించింది. ఈ విషయాన్ని అమితాబ్‌ ట్విటర్‌ ద్వారా వివరిస్తూ.. ‘అక్షయ్‌ ఇలా చేయడం ఇబ్బంది క‌లిగించింది. అతను ఇలా చేసి ఉండకూడదు' అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.

 ఇలాంటివి అమితాబ్‌కు నచ్చవు

ఇలాంటివి అమితాబ్‌కు నచ్చవు

బాలీవుడ్లో ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగినప్పటికీ అమితాబ్ ఎప్పుడూ ఒదిగే ఉంటారు. ఇండస్ట్రీలో అందరితోనూ ఆయన చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో కాళ్లు మొక్కించుకోవడం ఆయనకు ఇష్టం ఉండదు. అక్షయ్ అలా చేయడంతో తాను ఇబ్బంది పడ్డట్లు అమితాబ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

 ఇండియాకు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉన్నాడంటూ..

ఇండియాకు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉన్నాడంటూ..

అమితాబ్‌ను స్టేజీ మీదకు ఆహ్వానించే ముందు అక్షయ్ కుమార్ ఆయన గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమెరికాకు బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఉన్నారు. కానీ ఇండియాకు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉన్నారు. ఆయనే శ్రీ అమితాబ్ బచ్చన్ జీ అంటూ.... అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

 ప్రస్తుతం అమితాబ్ చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం అమితాబ్ చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ 102 నాటౌట్, టగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ వయసు 75 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన అలుపు లేకుండా ఓ వైపు టీవీ షోలు చేస్తూ సంవత్సరానికి కనీసం 5 సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X