»   »  హీరోయిన్ కాళ్లు పట్టిన హీరో, అసలేం జరిగింది? (ఫోటో)

హీరోయిన్ కాళ్లు పట్టిన హీరో, అసలేం జరిగింది? (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల్లో ఇలాంటివి ఎన్నయినా జరుగవచ్చు...ఎందుకంటే అదంతా నట. కానీ నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా అరుదు. బాలీవుడ్‌ సీరియల్‌ కిస్సర్‌ ఇమ్రాన్‌ హష్మి, నటి నర్గీస్‌ ఫక్రీ కలిసి 'అజర్' అనే చిత్రంలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌ సందర్భంగా కొన్ని మైళ్ళ దూరం నడవాల్సి వచ్చింది. దాంతో నర్గీస్‌ ఫక్రీ కాళ్ళ నొప్పులతో నడవలేనంటూ ఓ కుర్చీలో కూలబడిపోయింది. ఆమె బాధ చూడలేక ఇమ్రాన్‌ ఆమె కాళ్ళను సున్నితంగా నొక్కుతూ మసాజ్‌ చేశాడట! ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ నెట్‌వర్క్‌లో బాగా హల్‌చల్‌ చేస్తోంది.

ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా 'అజర్' చిత్రం తెరకెక్కుతోంది. ఈచిత్రంలో ఇమ్రాన్ హస్మి అజారుద్దీన్ పాత్రలో నటిస్తుండగా, నర్గీస్ ఫక్రి ఆయన రెండో భార్య సంగీత బిజిలానీ పాత్రలో నటిస్తోంది. అజారుద్దీన్ మొదటి భార్య నౌరీన్ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ నౌరీన్ నటిస్తోంది.

ఈ చిత్రానికి టోనీ డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. 'అజర్' అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. 'ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్' అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ఇమ్రాన్ హస్మి అజారుద్దీన్ పాత్రలో కనిపించబోతున్నాడు. క్రికెట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో.... ఇమ్రాన్ అజారుద్దీన్ స్టైయిల్‌లో బ్యాటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం స్వయంగా అజారుద్దీనే వచ్చి ఇమ్రాన్‌కు ట్రైనింగ్ ఇచ్చారు.

'అజర్' చిత్రంలో....అజారుద్దీన్ క్రికెట్లో అంచలంచెలుగా ఎదిగిన ఘట్టాలు....మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత అతను ఎదుర్కొన్న పరిస్థితులును ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. ఇందులో అజారుద్దీన్ ప్రేమ వ్యవహారం, పెళ్లి అంశాలను కూడా ఇంట్రెస్టింగ్ గా చూపించబోతున్నపారు.

అజార్ కు అత్యంత ఆప్తుడిగా పేరున్న వ్యక్తి ఆంటోనీ డిసౌజా. క్రికెటర్ జీవితాన్ని దగ్గర నుంచి పరిశీలించిన ఆంటోనీ సినిమాను వాస్తవానికి దగ్గరగా తీర్చిదిద్దగలడన్న నమ్మకంతో దర్శకత్వం బాధ్యతలను అప్పగించారట. ఈ బయోపిక్ ను కేవలం డ్రామాగా తీర్చిదిద్దబోవడంలేదని తెలిపిన చిత్ర బృందం... సినిమాకు అన్ని కమర్షియల్ హంగులూ అద్దబోతున్నట్లు వెల్లడించింది. మే 13న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ పోటో..

సోషల్ మీడియాలో ఈ పోటో..


నర్గీస్ ఫక్కి కాళ్లు పడుతున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

నర్గీస్ ఫక్రి


నర్గీస్ ఫక్రి ఈచిత్రంలో అజారుద్దీన్ రెండో భార్య, మోడల్ సంగీత బిజిలానీ పాత్రలో నటిస్తోంది.

అజారుద్దీన్

అజారుద్దీన్


ఈ సినిమా కోసం అజారుద్దీన్ స్వయంగా ఇమ్రాన్ కు క్రికెట్లో ట్రైనింగ్ ఇచ్చారు.

ఇద్దరు భామలు

ఇద్దరు భామలు


ఈచిత్రంలో ఇమ్రాన్ సరసన ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్ నర్గీస్ ఫక్రి, ప్రాచీ దేశాయ్ నటిస్తున్నారు.

రొమాంటిక్ సీన్లు

రొమాంటిక్ సీన్లు


సినిమాలో ఇమ్రాన్, నర్గీస్ మధ్య రొమాంటిక్ సీన్లు యమ హాటుగా ఉండబోతున్నాయి.

English summary
Emraan Hashmi recently gives foot massage to Nargis Fakhri during the shooting of their forthcoming movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu