For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మా సినిమా నెట్ లో లీకందంటూ హీరో, అబ్బబ్బే లీక్ కాలేదంటూ డైరక్టర్

  By Srikanya
  |

  ముంబై: ఇండస్ట్రీకి పెనుభూతం పైరసీ. ఈ పైరసీకి చెక్ పెట్ట‌డానికి ప్ర‌భుత్వం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. దానికి పూర్తిగా అడ్డుక‌ట్ట మాత్రం ప‌డ‌టం లేదనే విషయం తెలిసిందే. ఈ ఏడాది నాలుగో సినిమా రిలీజ్‌కు ముందే ఇంట‌ర్నెట్‌లో లీకైందంటూ నిన్న వార్తలు గుప్పు మన్నాయి. బాలీవుడ్ సీరియ‌ల్ కిస్స‌ర్ ఇమ్రాన్ హ‌ష్మి యాక్ట్ చేసిన రాజ్ రీబూట్ సినిమా నెట్‌లో లీకైందని ఆ వార్తలు సారాంసం.

  ఈ సినిమా ఈ నెల 16న విడుద‌ల కావాల్సి ఉంది. స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్‌తో బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు కొల్ల‌గొట్టిన రాజ్ సిరీస్‌లో ఇదే చివ‌రి మూవీ ఇది. సినిమా లీకైన విష‌యాన్ని ఇమ్రాన్ హ‌ష్మీయే ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించాడు. ఈ ఏడాది ఇప్ప‌టికే ఉడ్తా పంజాబ్‌, సుల్తాన్‌, గ్రేట్ గ్రాండ్ మ‌స్తీలాంటి సినిమాలు కూడా రిలీజ్‌కు ముందే లీకైన విష‌యం తెలిసిందే.

  అయితే దర్శకుడు విక్రమ్ భట్ మాత్రం అవన్నీ రూమర్స్ అని ఖండించారు. నెట్ లో దొరుకుతున్న వెర్షన్ బోగస్ ఫైల్ అని అన్నారు. అయితే లీక్ కాకుండా హీరోగారు లీకైందంటూ మరి ట్విట్టర్ లో అలా ఎందుకు ట్వీట్ చేసారో ఆయనకే తెలియాలి. ఈ లోగా ఇమ్రాన్ హష్మి కూడా కాస్త తేరుకుని లీక్ కాలేదంటూ మరోసారి ట్వీట్ చేసారు.

  ఇమ్రాన్‌ హష్మి, కృతి కర్బంద, గౌరవ్‌ అరోరాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రాజ్‌ రీబూట్‌. రాజ్ సీరీస్ లో వ‌స్తున్న నాల్గొవ సినిమా. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి విక్రమ్‌ భట్ ద‌ర్శ‌కుడు. సెప్టెంబర్‌ 16న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  మరిన్ని విశేషాలు క్రింద చదవండి

  rnrn

  మా సినిమా నెట్ లో లీకందంటూ హీరో, అబ్బబ్బే లీక్ కాలేదంటూ డైరక్టర్

  రాజ్‌ రీబూట్‌ ట్రైలర్..

   పందెం వేస్తున్నారు

  పందెం వేస్తున్నారు

  'రా జ్‌' చిత్రాల సిరీస్‌లో వస్తోన్న నాలుగో చిత్రం 'రాజ్‌ రీబూట్‌'. ఇమ్రాన్‌ హష్మీ, కృతి కర్బంద, గౌరవ్‌ అరోరా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్‌భట్‌ దర్శకుడు. ఈ సినిమా ట్లైలర్‌ విడుదలైంది. దీనికి మంచి స్పందన రావడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇమ్రాన్‌ హష్మీ స్పందిస్తూ ''హారర్‌ చిత్రాల్లో ఓ కొత్తవడికి శ్రీకారం చుట్టే చిత్రం 'రాజ్‌ రీబూట్‌'. తొలి చిత్రం మాదిరే ఇందులోనూ నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. 'రాజ్‌' మాదిరే ఈ చిత్రంలోనూ 'రాజ్‌' ఎవరో ప్రేక్షకులు చెప్పలేరు.ఈ విషయంలో పందానీకి సిద్ధమే''అని చెప్పాడు.

   గుడ్ బై అంటున్న మహేష్ భట్

  గుడ్ బై అంటున్న మహేష్ భట్

  బాలీవుడ్‌ సీనియర్‌ దర్శకుడు విక్రమ్‌ భట్‌.. నిర్మాత మహేష్‌ భట్‌ల సారథ్యంలో విజయవంతమైన చిత్రం 'రాజ్‌'. 2002లో విడుదలైన ఈ మూవీ.. అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్స్‌ కూడా మంచి విజయాన్నే అందుకున్నాయి. అయితే.. తాజాగా ఈ సిరీస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు నిర్మాత మహేష్‌భట్‌ ప్రకటించారు.

  రెండో భాగం హిట్టే మరి..

  రెండో భాగం హిట్టే మరి..

  హారర్‌ జోనర్‌లో బాలీవుడ్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ చిత్రానికి సీక్వెల్‌గా 2009లో 'రాజ్‌: ద మిస్టరీ కంటిన్యూస్‌' వచ్చింది. దర్శకుడు మోహిత్‌ సూరి తెరకెక్కించారు. ఇమ్రాన్‌ హష్మీ, కంగనా జంటగా నటించారు. ఇది కూడా మంచి ఫలితాలే రాబట్టింది. దాంతో అదే ఉత్సాహంతో మూడో భాగం మొదలెట్టారు నిర్మాతలు. .

   వంద కోట్లు వసూలు చేసింమది

  వంద కోట్లు వసూలు చేసింమది

  ఆ తర్వాత 2012లో వచ్చిన 'రాజ్‌3: ద థర్డ్‌ డైమెన్షన్‌'ను మళ్లీ విక్రమ్‌ భట్‌ తెరకెక్కించాడు. కెరీర్‌లో ఇమ్రాన్‌ హష్మీ అందుకున్న భారీ విజయం ఈ చిత్రంతోనే అని చెప్పాలి. ఈ రొమాంటిక్‌ హారర్‌ చిత్రంలో బ్లాక్‌బ్యూటీ బిపాసా బసు.. ఇషా గుప్తా ప్రధాన ప్రాతలు పోషించారు. ఈ చిత్రం దాదాపు రూ.100కోట్లు వసూలు చేసింది.

   అంచనాలు బాగా పెరిగాయి

  అంచనాలు బాగా పెరిగాయి

  అలా.. సక్సెస్‌ఫుల్‌ సీక్వెల్స్‌తో కొనసాగుతున్న 'రాజ్‌' సిరీస్‌లో ఇప్పుడు 'రాజ్‌ రీబూట్‌' సిద్ధమైంది. ఈ చిత్రాన్ని కూడా సీనియర్‌ దర్శకుడు విక్రమ్‌ భట్‌ తెరకెక్కించాడు. కిస్సుల వీరుడు ఇమ్రాన్‌ హష్మీ.. కృతి కర్బంద, గౌరవ్‌ అరోరాలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌లో వచ్చిన అన్ని సినిమాలు మంచి మార్కులు కొట్టేయడంతో రాజ్‌ రీబూట్‌పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఇలా.. 14ఏళ్లుగా సాగిన 'రాజ్‌' సీరీస్‌కు ఇక ఫుల్‌స్టాప్‌ పెడుతున్నట్లు నిర్మాత మహేష్‌ భట్‌ ప్రకటించడం ఇమ్రాన్‌ అభిమానులకు చేదు వార్తే మరి.

   కృతి కర్బందాకిది ప్రత్యేకం

  కృతి కర్బందాకిది ప్రత్యేకం

  'ఒంగోలు గిత్త'.. 'మిస్టర్‌ నూకయ్య'.. 'బ్రూస్‌లీ' వంటి తెలుగు చిత్రాల్లో నటించింది కృతి కర్భందా. ఏ చిత్రంలో చూసినా పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ భామ.. బాలీవుడ్‌లో సీరియల్‌ కిస్సర్‌ ఇమ్రాన్‌హష్మీతో కలిసి నటించిన 'రాజ్‌ రీబూట్‌' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇమ్రాన్‌ సినిమాలంటే.. ముద్దు సన్నివేశాలే ప్రత్యేకం. ఆయనతో తొలిసారి ఆ సన్నివేశాలను పండించిన కృతి.

   తొలిముద్దు ఇదే ,భయం వేసింది

  తొలిముద్దు ఇదే ,భయం వేసింది

  ''నా తొలి ముద్దు ఇమ్రాన్‌ హష్మీతోనే జరిగింది. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. నాలో నేను ఆ సన్నివేశంలో ఎలా నటించగలనని మదనపడ్డాను.నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బందికి గురయ్యా. ఎందుకంటే ఆ ముద్దు సన్నివేశంలో తెలియని వ్యక్తితో నటించడం కష్టంగా అనిపించింది అంటోంది కృతి కర్భందా. ఆమెకు కొత్త అనుభూతులు లభించాయిట.

   భర్త,మాజి ప్రియుడుతో ఉంటా

  భర్త,మాజి ప్రియుడుతో ఉంటా

  ఇందులో నాకు భర్త ఉంటాడు. అలాగే మాజీ ప్రియుడు ఉంటాడు. తెరపై హాట్ సన్నివేశాలు ఉంటాయని గాబరా పడ్డా. అయితే.. చిత్రం పూర్తయ్యాక చాలా మారిపోయా. బలాన్ని పుంజుకున్నాను. బాలీవుడ్‌లో ఉండాలంలే ప్రత్యేకమైన వైఖరి ఉండాల్సిన అవసరం లేదు'' అని చెప్పుకొచ్చింది కృతి కర్భందా. ఇంతకీ కృతి ఈ సినిమాలో సీన్స్ ఉన్నాయని చెప్తోందా..లేనట్లు చెప్తోందా.

   సందేహాలు ఉండేవి, కానీ ...

  సందేహాలు ఉండేవి, కానీ ...

  ఇమ్రాన్‌ హష్మీ గురించి మాట్లాడుతూ.. ''నాకు తెలిసి ముద్దు సన్నివేశాలను వెండితెరపై ట్రెండ్‌గా మార్చిన వ్యక్తి ఇమ్రాన్‌ హష్మీ. ఈ కాలంలో ముద్దు సన్నివేశం లేని చిత్రం ఉండట్లేదు'' అని అంటోంది కృతి. అలాగే మొదట్లో ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు చాలా సందేహాలు ఉండేవి. దక్షిణాది చిత్రాల్లో బాగా నటించాను. మంచి అమ్మాయిగా పేరుంది. కానీ.. 'రాజ్‌' అందుకు పూర్తి భిన్నం అంది కృతి కర్భందా.

  English summary
  Filmmaker Vikram Bhatt has denied that his forthcoming film Raaz Reboot has leaked online, but he says a bogus file in its name was made available online to warn miscreants.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X