»   » ఈ సినిమాలో చంద్రబాబుని ఇమిటేట్ చేసాను : జీవీ.ప్రకాష్ కుమార్

ఈ సినిమాలో చంద్రబాబుని ఇమిటేట్ చేసాను : జీవీ.ప్రకాష్ కుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంగీత దర్శకుడిగానే కాదు యువనటుడు గా కూడా తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటున్న జీవీ.ప్రకాశ్‌కుమార్. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన తాజాగా నటించిన చిత్రం "ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు" (నాకు ఇంకో పేరు ఉంది) ఈ నెలలోనే విడుదల కానుంది.

నటి ఆనంది నాయకిగా నటించిన ఈ చిత్రానికి "డార్లింగ్" ఫేమ్ శ్యామ్ ఆంటన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈసినిమా ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి హీరో జీవీ.ప్రకాశ్ కుమారే సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.

Enakku Innoru Per Irukku hits screens on June 17

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం స్థానిక ఎగ్మోర్‌లో గల రెడిసన్ హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఇది వినోదంతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా రానుంది అయితే ఇందులో తమిళ దివంగత నటుడు చంద్రబాబు నటనను అనుకరించే ప్రయత్నం చేశానని జీవీ.ప్రకాశ్‌కుమార్ తెలిపారు.

నటి ఆనంది మాట్లాడుతూ "త్రిష ఇల్లన్నా నయనతార" చిత్రం తరువాత జీవీతో మళ్లీ ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు.ఇందులో ముఖ్య పాత్ర పోషించిన నటుడు వీటీవీ గణేశ్ మాట్లాడుతూ తాను ఇళయదళపతి విజయ్‌తో నటించిన తెరి చిత్రం 100 కోట్లు వసూలు చేసిందని, ఇప్పుడు జీవీతో నటించిన ఎనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రం 150 కోట్లు వసూలు చేస్తుందని చమత్కరించారు.

English summary
GV Prakash will be completing his hat-trick spell on June 17 for the most expected film from his kitty Tittled "Enakku Innoru Peru Irukku"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu