»   » పవన్ కళ్యాణ్‌ పక్కదారి పట్టొద్దనే ఆ కండీషన్?

పవన్ కళ్యాణ్‌ పక్కదారి పట్టొద్దనే ఆ కండీషన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈరోస్ కంపెనీ పవన్ కళ్యాణ్ కు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాను ఈరోస్ సంస్థ రూ.80 కోట్లకు కొనుగోలు చేసిందని, ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాత శరత్ మరార్ తో ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ గత సినిమాలు అనుకున్న సమయానికి పూర్తి కాలేదు, ఈ సారి కూడా అలా జరిగితే తమకు నష్టం వస్తుందనే ఈరోస్ సంస్థ కండీషన్ పెట్టినట్లు సమాచారం. పైగా పవన్ కళ్యాణ్ కు సొంతగా రాజకీయ పార్టీ జనసేన ఉన్న నేపథ్యంలో సినిమాను మధ్యలో వదిలేసి పార్టీ తరుపున ప్రజా పోరాటాల్లో మునిగిపోకుండా ముందుగా సినిమా పూర్తి చేయాలనే ఇలాంటి కండీషన్ పెట్టిందని అంటున్నారు. ఈ కండీషన్ సంగతెలా ఉన్న ఈ కారణంగానైనా ‘సర్దార్ గబ్బర్ సింగ్' త్వరగా విడుదలవుతుందని అభిమానులు ఆశపడుతున్నారు.

EROS International Conditions to Pawan Kalyan

‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గట్స్...గన్స్ అండ్ లవ్ అంటూ పవన్ కళ్యాణ్ రెండు చేతులతో గన్స్ పేలుస్తూ విడుదలైన పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కు చెందిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', అతని స్నేహితుడు శరత్ మరార్‌కు చెందిన ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు సంబంధించిన లోగోలతో పాటు ఈరోస్ సంస్థ లోగో కూడా ఉంది.

ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కథానాయిక పాత్రలో పవన్ ప్రియురాలిగా కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు సమాచారం. గతంలో ఈ సినిమాకు అనీషా ఆంబ్రోస్ అనుకున్నారు. సినిమా ప్రారంభం కాక ముందే ఆమెను పక్కకు తప్పించారు. ఇపుడు కాజల్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

English summary
EROS International to co-produce Pawan Kalyan’s Movie Sardar GabbarSingh with Power Star Pawan Kalyan Creative Works & Northstar Entertainment. They kept some conditions to him that he should complete the movie in 6 months.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu