»   » సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూ. 300 కోట్ల డీల్?

సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూ. 300 కోట్ల డీల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తెలుగులో మహేష్ బాబు సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనతో భారీ డీల్స్ కుదుర్చుకోవడానికి పలు భారీ సినీ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ‘శ్రీమంతుడు' విజయం తర్వాత ఈ పోటీ మరింత ఎక్కువైంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ మహేష్ బాబుతో రూ. 300కోట్ల విలువైన భారీ డీల్‌ను కుదుర్చుకున్నట్లు సమాచారం. తెలుగు సినిమా చరిత్రలో ఒక హీరోతో ఈ రేంజిలో డీల్ కుదరడం ఇదే ప్రథమం అంటున్నారు. అయితే ఈ డీల్ ఎలా ఉండబోతోంది? ఆ సంస్థతో ఎన్ని సినిమాలు చేస్తారు? అనేది తెలియాల్సి ఉంది.

రెమ్యూనరేషన్లో కూడా రికార్డ్...
మహేష్, మురగదాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంకు సంభంధించిన కథ ఫైనలైజ్ చేసి ఇప్పుడు కాస్టింగ్ మొదలు పెట్టారు. హీరోయిన్ గా శృతి హాసన్ ని ఫైనలైజ్ చేసారు. అలాగే...ఏప్రిల్ రెండవ వారం 2016 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని సమచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మహేష్ బాబు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అని టాక్. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలవుతున్న నేపథ్యంలో ఇంత భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

Eros International had 300 Crores Deal with Mahesh Babu

బ్రహ్మోత్సవం...
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' సినిమాలో నటిస్తున్నారు. లుగు, త‌మిళ్ లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8, 2016న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

బ్రహ్మోత్సవం చిత్రాన్ని పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. సత్యరాజ్‌, జయసుధ, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, కళ: తోట తరణి.

English summary
Film Nagar source said that, Eros International had 300 Crores Deal with Mahesh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu