»   »  పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ : రేటింగులు అదిరాయ్

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ : రేటింగులు అదిరాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగుతో, భారీ వసూళ్లూ సాధించే సినిమాలతో నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ మధ్య పవన్ కళ్యాణ్ పేరును వాడుకుని పైకొచ్చిన వాళ్లు, లాభ పడ్డ వాళ్లు ఇండస్ట్రీటలో చాలా మందే ఉన్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ మేనియా బుల్లితెరకు కూడా పాకింది. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారం అవుతున్న 'జబర్దస్త్' కామెడీ షోలో షకలక శంకర్ పవన్ కళ్యాణ్ పవనిజం కాన్సెప్టును వాడుకుని అందరినీ బాగా నవ్వించాడు. పవన్ కళ్యాణ్‌ ఎఫెక్టుతో గురువారం ప్రసారం అయిన ఈ షో టీఆర్పీ రేటింగులు ఒక్కసారిగా భారీగా పెరిగాయని స్పష్టం అవుతోంది. ఈ షోలో పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా చూపించారు.

అలీ నిర్వహిస్తున్న 'అలీ 369' టీవీ షోలో కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొంటున్నట్లు....దీపావళికి ఈ షో ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. అలీ తనకు బాగా సన్నిహితుడు కావడంతో.......తొలిసారిగా బుల్లితెర కార్యక్రమంలో కనిపించడానికి ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్.

జబర్దస్త్ షో సంగతి పక్కన పెడితే.....పవన్ కళ్యాణ్ నిజంగానే కొందరి పాలిట దేవుడుగా మారాడనేది అభిమానుల అభిప్రాయం. ప్లాపుల బాటలో ఉన్న యువ హీరోలను హిట్ బాటలో నడిపించి దేవుడయ్యాడు. నిర్మాతలకు కనక వర్షం కురిపించి దేవుడు అయ్యాడు. మొత్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజిని పెంచి ధీరుడయ్యాడని అంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం రికార్డు కలెక్షన్లతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. రూ. 100 కోట్ల దిశగా దూసుకెలుతున్న ఈచిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మార్కెట్ రేంజి ఏమిటో నిరూపిస్తోంది. రాముడు చెబితే తప్ప హనుమంతుని శక్తి ఏమిటో బయట పడలేదు అనే చందంగా.....పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా వచ్చే దాకా తెలుగు సినిమా మార్కెట్ పరిధి రేంజి ఇంత స్థాయిలో ఉందనేది తెలియలేదు అని అంటున్నారు అభిమానులు.

తాజాగా అత్తారింటికి దారేది చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో సరికొత్త బెంచ్ మార్కును అందుకుంది. ఈచిత్రం ఓవర్స్ వసూళ్లలో రూ. 20 కోట్లను అధిగమించింది. ఒక్క అమెరికాలోనే ఈచిత్రం రూ. 14 కోట్లుకు పైగా వసూలు చేసింది. యూకె. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, సింగపూర్ లాంటి దేశాల్లో మొత్తం కలిపి రూ. 6 కోట్లకు పైగా రాబట్టింది.

English summary
Tollywood star Pawan Kalyan became most popular actor ever in the history of Telugu cinema. Power Star name it self creating wonders in the state. Due to that reason every body are keen to use his fame and get popular. Jabardasth Comedy show personality Shakalaka Shankar is now trying to make a fame and get popular.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu