Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
టాలీవుడ్ స్టార్ అల్లరి నరేష్ ఇంట విషాదం
టాలీవుడ్ స్టార్ అల్లరి నరేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. నరేష్ నాయనమ్మ, ఈవీవీ సత్యనారాయణ తల్లి ఈదర వెంకటరత్నమ్మ మంగళవారం మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా కోరుమామిడిలోని నివాసంలో ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సన్నిహితులు వెల్లడించారు.
ఈదర వెంకటరత్నమ్మ వయసు 87 సంవత్సరాలు. తన కుమారుడు ఈవీవీ సత్యనారాయణ మరణించిన తర్వాత ఆమె హైదరాబాద్ నుంచి తమ స్వస్థలం... నిడదవోలు సమీపంలోని కోరుమామిడి వెళ్లిపోయి గత 8 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. వెంకటరత్నమ్మ ఏజ్ రిలేటెడ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు.

కోరుమామిడిలో ముగిసిన అంత్యక్రియలు
వెంకరత్నమ్మ అంత్యక్రియలు కోరుమామిడిలో మంగళవారం నిర్వహించారు. అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్‌తో పాటు దర్శకుడు సత్తిబాబు, నిర్మాత కానుమిల్లి అమ్మిరాజు, ఈవివి కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

భారీగా తరలి వచ్చిన గామస్థులు
ఈవివి కుటుంబానికి కోరుమామిడితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు ఉంది. ఈ విషాద సంఘటన తెలియంతో భారీ సంఖ్యలో గామస్థులు తరలి వచ్చి అంత్యక్రియల్లో పాలు పంచుకున్నారు. ఈదర వెంకట్రావు, వెంకరత్నమ్మ దంపతులకు మొత్తం నలుగురు సంతానం. అందులో ఈవీవీ సత్యనారాయణ పెద్దవాడు కాగా... తర్వాత గిరి, శ్రీనివాస్ అనే కుమారులు, కుమార్తె ముళ్లపూడి మంగ ఉన్నారు.

హ్యాపీ మూడ్లో ఉండగా విషాదం
‘మహర్షి' విజయంతో తన కెరీర్ సరికొత్త దారిలో ప్రయాణిస్తుందనే హ్యాపీ మూడ్లో ఉన్న అల్లరి నరేష్.... ఇంతలోనే నాయనమ్మ మరణంతో విషాదంలో మునిగిపోయాడు. ప్రస్తుతం కోరుమామిడిలోనే ఉన్న కుటుంబ సభ్యులంతా అక్కడ అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్ రానున్నారు.

అల్లరి నరేష్
‘మహర్షి' తర్వాత అల్లరి నరేష్ ఏ సినిమాకు కమిట్ కాలేదు. ఇకపై పూర్తి భిన్నమైన పాత్రలతో తన కెరీర్ ముందుకు సాగించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక రోటీన్ కామెడీ పాత్రలు కాకుండా డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.