»   » డబ్బు దొంగిలించారు, రేప్ చేసారు: పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

డబ్బు దొంగిలించారు, రేప్ చేసారు: పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి, బిగ్ బాస్ షో మాజీ పోటీ దారు పూజా మిశ్రా రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లోని ఆదర్శ్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. గత వారం పూజా మిశ్రా ఫోటో షూట్ కోసం జైపూర్ వచ్చింది. ఇక్కడే ఓ హోటల్ లో బస చేసింది. ఈ సందర్భంగా తనపై అఘాయిత్యం జరిగినట్లు ఆమె ఆరోపించారు.

హోటల్ లో బస చేసిన తర్వాత తన వద్ద ఉన్న రూ. 2 లక్షలు పోయాయని, అందుకు కారణంగా సెలూన్ ఓనర్ రితూ దేశ్వాల్ అంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఫోటో షూట్ కోసం ప్రిపేర్ అవ్వాలని ఓ సెలూన్ కు వెళ్లగా ఈ వెంట్ ఆర్గనైజర్ తన బిల్లు డబ్బులు మరింత ఎక్కువ చేయాలన్న ఉద్దేశ్యంతో రెండు గంటల పాటు ఈవెంట్ ఆలస్యం చేసారని ఆరోపించారు.

Pooja Mishra

హరీష్, మోసిన్, సుహాన్ అనే ముగ్గురు వ్యక్తులు ఫోటో షూట్ చేసిన పుటేజీ ఇవ్వడానికి చాలా ఎక్కువ డబ్బు డిమాండ్ చేసారని, బ్లాక్ మెయిల్ చేసారని, అందుకు తాను అంగీకరించలేదని.... ఆ కోపంతో జూన్ 13న తాను తిన్న ఆహారంలో డ్రగ్స్ కలిపి తనపై లైంగిక దాడి ప్రయత్నం చేసారని ఫిర్యాదులో పేర్కొంది. పూజా మిశ్రా ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్లు 376(రేప్), 384(బ్లాక్ మెయిల్) కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

అయితే రితూ దేశ్వాల్ వాదన మరోలా ఉంది. ఆమె తమ స్టాఫ్ తో అమర్యాదగా ప్రవర్తించిందని, తన పర్మిషన్ లేకుండా సెలూన్ నుండి కొన్ని వస్తువులు చోరీ చేసిందని ఆరోపించారు. పోలీసులు ఈ కేసులో నిజా నిజాలు తేల్చే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
Model and Ex-Bigg Boss contestant Pooja Mishra has filed a report against 3 videographers in Jaipur for gangraping her. According to Amar Ujala, Pooja was in town for the shooting and promotion of her lifestyle show, ‘Abhi To Party Shuru Hui Hai’. Pooja alleged that they intoxicated her after dinner and gangrape her. Although police is doing its investigation in the matter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu