పవన్ పార్టీ విధాన నిర్ణయాలు(అఫీషియల్)

By Srikanya

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన కొత్త పార్టీ 'జనసేన' తన విధానాన్ని ప్రకటించింది. సామాజిక, రాజకీయ ఎజెండాతో ముందుకు సాగే జనసేన పార్టీ సుదీర్ఘ లక్ష్యాల కోసం మాత్రమే పోరాటం చేస్తుందని వెల్లడించింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే తాత్కాలిక పార్టీ కాదని పేర్కొంది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలనూ సెలవుదినాలుగా పాటించాలని నిర్ణయించింది.

జయంతులు, వర్ధంతులు, మతపరమైన పండుగలన్నీ రాజకీయ ప్రయోజనాలకోసం సృష్టించినవే తప్ప జాతి సమగ్రత కోసం ఉద్దేశించినవి కావని జనసేన పార్టీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాజకీయాల్లో నూతననాయకులను తయారుచేసే దిశగా పవన్‌ కల్యాణ్‌ పార్టీ విధి విధానాలను రూపొందిస్తున్నారని, సమాజంలో పునాది స్థాయినుంచి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనేది కల్యాణ్‌ లక్ష్యమని స్పష్టం చేసింది.

 Jana Sena

పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు ప్రారంభమైందని, ఇప్పటికే వందల మంది అభిమానులు, ఇతర కార్యకర్తలు తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని పేర్కొన్న జనసేన పార్టీ నెమ్మదిగా తమ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించింది.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం పవన్ తన పార్టీని పకడ్బందీగా నిర్మించి... వీలైతే 2019 ఎన్నికల బరిలో దిగాలన్నది ఆయన ఆలోచన. అయితే... ఈసారి విజయవాడ లోక్‌సభ సీటును పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్‌కు ఇవ్వాలని పవన్ సిఫారసు చేస్తున్న ప్రచారంపై స్పందించడానికి 'జనసేన' వర్గాలు ఇష్టపడటంలేదు. 'మాకు తెలిసినంతవరకూ అటువంటిదేమీ లేదు' అని చెబుతున్నారు. ఇక... బీజేపీతో పవన్ ఇంతవరకూ నేరుగా చర్చలేవీ జరపలేదని, టీడీపీతో బీజేపీ పొత్తు కుదుర్చుకొంటే ఆ పార్టీ తరపున కూడా ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X