twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య, చరణ్ సినిమాలకు ఈ పరిస్థితి అందుకే... సంక్రాంతి మూవీస్‌పై తమ్మారెడ్డి రివ్యూ!

    |

    Recommended Video

    Tamma Reddy Bharadwaj Talks About Sankranthi Movies | Filmibeat Telugu

    ఈ సంక్రాంతికి ఎన్టీఆర్-కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్2 చిత్రాలు విడుదలవ్వగా.... బాక్సాఫీసు విన్నర్ ఎవరు? అనే చర్చ టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మూడు సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్‌ను విశ్లేషిస్తూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ వీడియో విడుదల చేశారు.

    ఈ పండక్కి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ముందుగా క్రిష్-బాలకృష్ణ 'ఎన్టీఆర్-కథానాయకుడు' విడుదలయ్యాయి. క్రిష్-బాలయ్య కాంబినేషన్లో గతంలో సంక్రాంతికి 'గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదలైంది. అదే సమయంలో చిరంజీవి 'ఖైదీ నెం. 150' కూడా విడుదైలంది. ఆ సమయంలో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' అనుకున్న స్థాయిలో వండర్స్ క్రియేట్ చేయలేక పోయిందని తమ్మారెడ్డి తెలిపారు.

    ఎన్టీఆర్-కథానాయకుడు... అందుకే అనుకున్న ఊపు, కలెక్షన్ రాలేదు

    ఎన్టీఆర్-కథానాయకుడు... అందుకే అనుకున్న ఊపు, కలెక్షన్ రాలేదు

    ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఫస్టాఫ్ నాకు బాగా నచ్చింది. సెకండాఫ్ లో ఓ సినిమాలో పాట, ఓ సినిమాలో డైలాగ్ తీసుకుని నడిపించారు. ఇందులో కథ నడిచిన దానికంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేత ఈలలు వేయించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపించింది. దాని వల్ల సినిమాలో ఒక ఫ్లో లేకుండా పోయింది. క్లైమాక్స్‌లో పార్టీ పెట్టే సీన్‌తో ఆపారు. నెక్ట్స్ వచ్చే ‘మహానాయకుడు'లో ఏముంటుందనే ఆసక్తి కలిగే విధంగా తీశారు. సినిమా కొంత వరకు బాగానే ఉన్నా... దీన్ని ఇంట్రస్టుగా చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చేయలేదు కాబట్టి ప్రజలు డిసప్పాయింట్ అయ్యారు. అందుకే రావాల్సినంత ఊపుకానీ, కలెక్షన్స్ రాలేదని తమ్మారెడ్డి తెలిపారు.

    <strong>ఓ వైపు డిజాస్టర్ టాక్.. మరోవైపు డీసెంట్ కలెక్షన్లు... రాంచరణ్ స్టామినా అంటే ఇదే..</strong>ఓ వైపు డిజాస్టర్ టాక్.. మరోవైపు డీసెంట్ కలెక్షన్లు... రాంచరణ్ స్టామినా అంటే ఇదే..

    ‘పేట' అంచనాలు అందుకోలేదు

    ‘పేట' అంచనాలు అందుకోలేదు

    రజనీకాంత్ నటించిన ‘పేట' బావుందంటున్నారు. పాత రజనీకాంత్ చూసినట్లు ఉందంటున్నారు. తెలుగులో థియేటర్లు లేవు కాబట్టి తక్కువ కలెక్షన్ వచ్చిందంటున్నారు... థియేటర్లు ఉన్నా కూడా ఫస్ట్ డే, సెకండ్ డే ఉండేదేమో? ఏది ఏమైనా ‘పేట' కూడా అంచనాలను అందుకోలేక పోయింది. తక్కువ రేటుకు కొన్నారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు బయట పడతారేమో? అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

    వినయ విదేయ రామ అందుకే ఫ్యాన్స్‌కు నచ్చలేదు

    వినయ విదేయ రామ అందుకే ఫ్యాన్స్‌కు నచ్చలేదు

    ‘రంగస్థలం' తర్వాత ‘వినయ విధేయ రామ'పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. చరణ్‌ను ఒక యాక్టర్‌గా నిలబెట్టిన సినిమా రంగస్థలం. ముందు చరణ్ వేరు, ఆప్టర్ రంగస్థలం చరణ్ వేరు. చరణ్-బోయపాటి కాంబినేషన్ కావడంతో బాగా హైప్ వచ్చింది. బోయపాటి రెగ్యులర్‌గా తీసినట్లే తీశాడు. సెకండాఫ్ లో కేవలం ఫైట్స్ కోసమే తీసినట్లు ఉండటంతో చాలా మందికి అభిమానులకు నచ్చలేదు. కెజిఎఫ్ చిత్రంలో కూడా మొత్తం ఫైట్లే ఉన్నప్పటికీ అది కొత్తగా ఉండటం వల్ల ఆడిందని... తమ్మారెడ్డి తెలిపారు.

    ఎఫ్ 2 గురించి

    ఎఫ్ 2 గురించి

    దిల్ రాజుకు సంక్రాంతి సినిమాలు తీయడం బాగా తెలుసు. గతంలో ఆయన సంక్రాంతికి రిలీజ్ చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి, ఇపుడు ‘ఎఫ్ 2'. ఎంటర్టెన్మెంటుతో కూడి ఫ్యామిలీ డ్రామా. కామెడీ కూడా బాగా వర్కౌట్ కావడంతో ఈ సినిమా బాగా ఆడుతోంది, మంచి కలెక్షన్ రాబడుతోందని తెలిపారు.

    ఎవరు సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ కాదు

    ఎవరు సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ కాదు

    సక్సెస్ ఫెయిల్యూర్ కంటే కూడా ఎవరి ప్రయత్నం వారు చేశారు. ఎవరు సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ కాదు... ప్రతి వాళ్లకు సక్సెస్ వస్తుంది, ప్రతి వారికి ఫెయిల్యూర్ వస్తుంది. ఈ రోజు సక్సెస్ వీళ్లది...రేపు సక్సెస్ ఎవరదో చూడాలి అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

    English summary
    F2, Petta, NTR & VVR? Telugu Veteran Director Tammareddy Bharadwaj Reveals the Sankranthi 2019 Tollywood Box Office, Winner. Varun Tej & Venkatesh's #F2 : Fun & Frustration is simply good. Rajinikanth’s #Petta is rocking right from the advance bookings. Now, to the most disappointing movie of this Pongal is Ram Charan's #VinayaVidheyaRama and talking about #NTR Kathanayakudu, though it opened to positive talk, the movie is dragging says #TammareddyBharadwaj. Finally, he says all the four releases are in the theatres and the verdict is quite clear at the box-office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X