»   » ‘బాహుబలి’ : కాలకేయ చెప్పే ‘కిలికి’ భాష ఎలా పుట్టిందంటే

‘బాహుబలి’ : కాలకేయ చెప్పే ‘కిలికి’ భాష ఎలా పుట్టిందంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా తిరుపతి ఎస్వీయూ మైదానంలో అత్యంత ఘనంగా ‘బాహుబలి' ఆడియో వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో వేడుకలో ...ఈ చిత్రంలో వాడిన ప్రత్యేకమైన భాష గురించి ఓ డెమో లాంటిది ఇచ్చారు స్టేజీపై. ఆ లాంగ్వేజ్ మీకు ఓ సారి ఈ క్రింద వీడియోతో గుర్తు చేసుకోండి. తర్వాత ఈ క్రింద ఎలా ..ఈ భాష పుట్టిందో చదవండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుఈ భాష పేరే ‘కిలికి'. ఈ సినిమాలోని కాలకేయ వార్ లార్డ్ కి సంబంధించిన భాష ఇది. ఈ భాషని కనిపెట్టింది ఎవరు అనే విషయానికి వస్తే తమిళ లిరిసిస్ట్ మరియు డైలాగ్ రైటర్ మధన్ కార్కీ ఈ భాషని ఇన్వెంట్ చేసాడు.


మదన్ కార్కీ ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూలో కిలికి భాషకి సంబందించిన ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.. ‘రాజమౌళి గారు కాలకేయుల కోసం ఓ పవర్ఫుల్ మరియు మోటైన భాష కావాలన్నారు, అదికూడా వింటుంటేనే మనలో భయం కలిగేలా ఉండాలని అన్నారు. దాంతో ఈ కిలికి భాషని కనిపెట్టా. ఇందుకోసం 40 గ్రామర్ రూల్స్ తో కూడిన 750 పదాలను కనిపెట్టాం.


అంతే కాకుండా షూటింగ్ స్పాట్ లో అందరూ రెఫర్ చేసుకోవడానికి కొన్ని రెఫరెన్స్ డాక్యుమెంట్స్ ని కూడా ప్రిపేర్ చేసాము. కిలికి భాషలో కొన్ని పదాలు అర్థం చేసుకోవడానికి, వాటిని పలకడం కష్టంగా ఉంటుంది. అందుకే ఆ పదాలని ఎలా పలకాలి అనేది రికార్డ్ చేసి సెట్స్ కి పంపాను. ఒకటి మాత్రం చెప్పగలను కాలేకయులు ఈ భాష మాట్లాడుతుంటే వినేవాళ్లలో భయం కలుగుతుందని' అన్నాడు.


Facts behind the invention of Baahubali’s ‘Kiliki’ language

బాహుబలి సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ,మలయాళ , హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అన్ని భాషల్లోనూ కిలికి భాష కామన్ గా ఉంటుంది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్టర్. జూలై 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


బిజినెస్ విషయానికి వస్తే...


ఇక ఈ వేడుకతో,అంతకు ముందు వదిలిన ట్రైలర్ తో ఈ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని కి విపరీతమైన క్రేజ్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.


USA థియోటర్ రైట్స్ ని తొమ్మిది కోట్లకు అంతుకు ముందే కొనుగోలు చేసిన బయ్యర్ 12 కోట్లు కు తిరిగి రీజనల్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. అంటే 2.4 మిలియన్ డాలర్లుకు అన్నమాట. దానర్దం సినిమా రిలీజ్ కు ముందే మూడు కోట్లు లాభం చూసారన్నమాట. ఇంకా ఇలా ఎంతమందికి ఈ చిత్రం డబ్బులు పంట పండించనుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.


Facts behind the invention of Baahubali’s ‘Kiliki’ language

ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.


ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.


భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

English summary
In a recent interview, Madhan revealed a few interesting facts behind the invention of Baahubali language Kiliki. Apparently, Madhan invented the language when Rajamouli wanted a ‘powerful and a raw language that incites fear’.
Please Wait while comments are loading...