twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RC 15: రామ్ చరణ్ సినిమాలో పవర్ఫుల్ విలన్.. అతన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే?

    |

    పాన్ ఇండియా సినిమాల హడావిడి మొదలైన అనంతరం ఆ ప్రాజెక్టులలో నటించే నటీనటుల కూడా నెవర్ బిఫోర్ అనే పాత్రల్లో కనిపిస్తున్నారు. కేవలం హీరోలకు మాత్రమే కాకుండా అలాంటి ప్రాజెక్ట్ లల్ నటిస్తుండడం వలన మిగతా నటీనటులు కూడా భారీ స్థాయిలో క్రేజ్ అయితే అందుతోంది. ముఖ్యంగా విలన్స్ కోసం దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్న విధానం చాలా డిఫరెంట్ గా ఉంటోంది. భాషతో సంబంధం లేకుండా టాలెంట్ నటీనటులకే ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నాయని చెప్పాలి.

    ఇక రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో కూడా విలన్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్ అయితే వస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఒక ప్రముఖ నటుడు రామ్ చరణ్ సినిమాలో కూడా ప్రతి నాయకుడిగా కనిపించే అవకాశం ఉందట. దర్శకుడు శంకర్ అతను నటిస్తేనే సినిమాకు చాలా బావుంటుందమి ఆలోచిస్తున్నాడట.

    ఇప్పట్లో అయితే ఆ ఛాన్స్ లేదు

    ఇప్పట్లో అయితే ఆ ఛాన్స్ లేదు

    తమిళ దర్శకుడు శంకర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక సందేశాత్మక అంశం హైలెట్ అయి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీలైనంత వరకు సామాజిక అంశాలపై కమర్షియల్ గా అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ ఉంటారు. ఇక రోబో అనంతరం శంకర్ అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.

    భారీ అంచనాలతో సెట్స్ పైకి వచ్చిన ఇండియన్ 2 సినిమా కూడా సగం షూటింగ్ అవ్వగానే మూలన పడిపోయింది. ఇప్పట్లో అయితే ఆ సినిమా మళ్లీ మొదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక ఫైనల్ గా రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక డిఫరెంట్ పొలిటికల్ సినిమాతో హిట్టు కొట్టాలని సిద్ధమవుతున్నాడు.

    ప్రాజెక్ట్ సెట్టవ్వడానికి పెద్దగా టైమ్ పట్టలేదు

    ప్రాజెక్ట్ సెట్టవ్వడానికి పెద్దగా టైమ్ పట్టలేదు

    తెలుగు హీరోతో ఒక సినిమా చేయాలని దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. కొన్నిళ్ళ క్రితం మహేష్ బాబుతో త్రి ఐడియట్స్ రీమేక్ చేయాలని కూడా అనుకున్నాడు. కానీ సూపర్ స్టార్ రీమేక్ సినిమాలు చేయనని చెప్పడంతో ఆ తరువాత తెలుగు హీరోలను పెద్దగా టచ్ చేయలేదు.

    మెగాస్టార్ చిరంజీవి కూడా శంకర్ తో సినిమా చేయాలని కొన్నిసార్లు ప్రయత్నాలు చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక రామ్ చరణ్ తో సినిమాతో ప్రాజెక్ట్ సెట్టవ్వడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. రంగస్థలం సినిమా చూసిన తర్వాత శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక సింగిల్ సిట్టింగ్ లోనే ఆ కాంబో ఫాస్ట్ గా సెట్టయ్యిందట.

    విలన్ పాత్ర కోసం ఫహద్ ఫాసిల్

    విలన్ పాత్ర కోసం ఫహద్ ఫాసిల్

    RRR సినిమా తర్వాత రాబోయే ప్రాజెక్ట్ కూడా స్థాయికి తగ్గట్లుగానే ఉండాలని రామ్ చరణ్ ముందుగానే శంకర్ కు వివరణ ఇచ్చారట. శంకర్ కూడా హీరో ఆలోచనలకు తగ్గట్లుగానే వెంటనే ఒప్పేసుకుని కథను మరింత బలంగా రెడీ చేసుకున్నాడు. సినిమాలో నటించే నటీనటుల విషయంలో కూడా శంకర్ ఎప్పట్లానే ఆలోచిస్తున్నాడు.

    సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండాలని మలయాళం టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాసిల్ సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నటుడు ఇప్పటికే అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప సినిమాలో విలన్ పాత్ర చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకోవడంతో అందటి దృష్టి అతనిపైనే పడింది.

    ఎందుకు ఒప్పుకున్నాడంటే..

    ఎందుకు ఒప్పుకున్నాడంటే..

    రానున్న రోజుల్లో ఫహద్ ఫాసిల్ తప్పకుండా పాన్ ఇండియా యాక్టర్ అవుతాడు అని చెప్పవచ్చు. ఇతనికి గతంలో కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టులు అంతగా నచ్చకపోవడంతో ఒప్పుకోలేదు. ఇక ఫైనల్ గా తెలుగు హీరోల కథలతో ప్రతినాయకుడి పాత్రలు చాలా బలంగా అనిపించడంతో వెంటనే ఒప్పుకున్నాడట.

    పుష్ప సినిమాతో పాటు RC15 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుండడం అతనికి బాగా కలిసొచ్చే అంశం. ఈ సినిమాలకు రెమ్యునరేషన్ కూడా అడిగినంత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

    ఆ పాత్రకు అతనే కరెక్ట్ అని..

    ఆ పాత్రకు అతనే కరెక్ట్ అని..

    సినిమాలో ఫహద్ ఫాసిల్ ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపిస్తాడట. ఐపీఎస్ ఆఫీసర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన హీరోను అతను తన బుద్ధిబలంతో ఢీకొట్టే విధానం చాలా విబిన్నంగా ఉంటుందట. అమాయకంగా కనిపిస్తూనే మోసం చేసే ఒక కన్నింగ్ స్వభావంతో ఉంటారట.

    అలాంటి భిన్నమైన లక్షణాలతో ఫహద్ ఫాసిల్ ఇదివరకే కొన్ని పాత్రలు చేశాడు. నేషనల్ అవార్డు సైతం అతనికి చాలా తొందరగా దక్కింది. ఇక RC15 సినిమాకు కరెక్ట్ గా సెట్ అవుతాడని దర్శకుడు శంకర్ ఇటీవల హీరో తో మాట్లాడి ఫహద్ ఫాసిల్ ను విలన్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం.

    Recommended Video

    Shakalaka Shankar Corporator Movie Official Trailer Released | Filmibeat Telugu
     రిలీజ్ ఎప్పుడంటే..

    రిలీజ్ ఎప్పుడంటే..

    ఇక రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా ఇటీవల పూర్తయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లోగా సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు శంకర్ ఇదివరకే నిర్మాత దిల్ రాజు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కాగా కియారా అద్వానీ ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక మరొక ముఖ్యమైన పాత్ర కోసం తెలుగు నటి అంజలిని సెలెక్ట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Fahadh Faasil to play the lead antagonist role in RC15. The drama between Ram Charan and Fahadh Faasil is the key point to this political thriller.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X