For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ హొటల్ విషయం లో.... డోంట్ కేర్...! బికాజ్ షి ఈజ్ నయన్...

  |

  మొదటినుంచీ నయన తార మీద అందరికీ ఉన్న కంప్లైంట్ ఒక్కటే నయన్ కి కాస్త కోపం ఎక్కువే... అయితే ముక్కుసూటి తనం వల్ల కూడా కొన్ని సార్లు నయన్ మాటలని కోపం కిందే జమకట్టేసారు చాలామంది. నిజానికి నయన్ కి అట్టిట్యూడ్ ప్రాబ్లెం... ఆమె అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే తట్టుకోలేదు... కొన్ని సార్లు అక్కడ ఉన్నవాళ్ళ మీద అరిచిన సంధర్భాలూ ఉండొచ్చు... అందుకే నయన్ కి కోపమెక్కువ అన్న మాటలను ఆమె పట్టించుకోదు

  అయితే దాన్నే బేస్ చేసుకొని ఇప్పటికే కొంతమంది దర్శక నిర్మాతలు నయన్ ని దూరంగా ఉంచుతున్నారు అనీ., ఆ కోపాన్ని తాను బస చేసే ఫైవ్ స్టార్ హోటల్ స్టాఫ్ పై కూడా చూపిస్తూ అక్కడికీ ఆగక కోపంగా అక్కడ ఉండే ఫర్నీచర్ ని పగలకొడుతుందట.

  అంటూ కొన్ని వార్తలు వినిపించాయి.ఆ తరవాత నష్టపరిహారాన్ని కట్టినా, ఆ హోటల్ యాజమాన్యానికి మళ్ళీ రిపేర్ లు చేయించుకోవడానికి టైం పట్టడం, ఈ లోపు బిజినెస్ పోవడం లాంటి నష్టాలు భరించాల్సి వస్తుందట. అందుకే ఏకంగా తనని ఫైవ్ స్టార్ హోటల్స్ బ్యాన్ చేసేసాయంటూ కొన్ని వార్తలు వచ్చాయి... కానీ అవన్ని రూమర్లే అని తేలిపోయింది ఎందుకంటే.... నయన్ హైదరాబాద్ బస లో ఒక సీక్రేట్ ఉంది అదేమిటో స్లైడ్ షో లో చూద్దాం...

  నిజానికి నయన్ ప్రపంచమేవేరు....

  నిజానికి నయన్ ప్రపంచమేవేరు....

  ఎప్పుడూ పార్టీలకూ... ఫంక్షలకూ వచ్చే రకం కాదు. ఎవరినీ అనవసరంగా మాటల్లోకి లాగటం నయన్ కి అలవాటూ లేదు.

  నయన్...

  నయన్...

  ఎప్పుడు వార్తల్లోకి ఎక్కినా తన పర్సనల్ ప్రాబ్లెమ్స్ లోనే రచ్చకెక్కింది తప్ప పబ్లిక్ లో ఎప్పుడూ హద్దు మీరలేదామె...

  ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్..

  ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్..

  ఇలా ఏ సోషల్ ప్లాట్ ఫామ్ లోనూ నయనతార లేదు. వాటిపై ఇంట్రెస్ట్ కూడా చూపించదు. అందుకే ఈమెను డైరెక్టుగా అప్రోచ్ కావడం ఎవరికైనా చాలా కష్టం. సాధారణంగా సినిమా ఫంక్షన్లకు కూడా హాజరయ్యే అలవాటు ఈమెకు లేదు. అందుకే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా తలెత్తదు.

  నయనతార

  నయనతార

  గత కొన్ని రోజులుగా నయనతారపై చాలానే వార్తలు వస్తున్నాయి. హైద్రాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో నానా రచ్చ చేసిందని.. కాస్ట్లీ ఆర్టికల్స్ ను బద్దలు కొట్టేసిందని.. ఈమెను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదని.. ఇలా రకరకాల న్యూస్ వచ్చాయి.

  నయన్...

  నయన్...

  వీటన్నిటితోపాటు నయన్ కి హోటల్ రూమ్ ఇచ్చేందుకు స్టార్ హోటల్స్ సిద్ధంగా లేవని కూడా రూమర్స్ క్రియేట్ అయ్యాయి.

  అయితే..

  అయితే..

  ఇక్కడ ఎవరికీ తెలియని రహస్యం ఒకటుంది టాలీవుడ్లో అడుగు పెట్టినప్పటి నుంచి హైద్రాబాద్ వచ్చినపుడల్లా నయన్ ఒకే హోటల్ లో ఉంటుంది. ఆ హొటల్లో తప్ప వేరే హోటల్ కి వెళ్లదు.

  సింపుల్ గా

  సింపుల్ గా

  సింపుల్ గా చెప్పాలీ అంటే నయన్ కి హైద్రాబాద్ హోమ్ అదే అన్నమాట. ఆ హోటల్ వారితో నయనతారకు కానీ.. ఈమెతో వారికి కాని ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిసింది. ఇక మిగిలిన హొటళ్ళు నయనతారని బ్యాన్ చేయటం ఎందుకో అర్థం కాక తెల్ల మొహం వేసారు అక్కడి స్టాఫ్..

   నయన్...

  నయన్...

  అసలు వేరే హొటల్లోకి వెళ్లనే వెళ్ళని నయన తార అక్కడి వస్తువులని పగల గొట్టటం, వాళ్ళంతా ఈమెని బ్యాన్ చేయటం అంతా "ఉత్తుత్తినే" అన్న మాట.

  నయన తార

  నయన తార

  అదన్న మాట సంగతి ఇంత హంగామా నడుస్తున్నా నయన తార కనీసం ఈ విషయం లో స్పందించకపోవడానికి కారణం. అయినా ఇలాంటి చిన్న చిన్న సంగతులకి నయన్ ఎప్పుడు రియాక్ట్ అయ్యిందని ...

  English summary
  A lot of rumors have been under circulation regarding Nayantara's Bihavior in Hyderabad star hotels. But Nayan Dont care of it why?
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X