twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ బిహేవియర్ సరిదిద్దుకో... విశ్వక్ సేన్ నిజస్వరూపం బయట పెట్టిన తరుణ్ భాస్కర్!

    |

    Recommended Video

    Tharun Bhascker Message To Vishwak Sen Over Falaknuma Das Controversy || Filmibeat Telugu

    'ఫలక్‌నుమా దాస్' సినిమా విషయంలో జరుగుతున్న వివాదంపై దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందించారు. ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో బూతులు మాట్లాడి విమర్శల పాలైన విశ్వక్ సేన్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో విశ్వక్ సేన్ కొన్ని విషయాల్లో పద్దతి మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

    విశ్వక్ సేన్ ఏ విషయం అయినా మనస్పూర్తిగా మాట్లాడతాడు. ఎవరినీ ద్వేషించడు. కానీ అతడు మాట్లాడే తీరు చూస్తే కొన్ని సార్లు తప్పుగా అనిపిస్తుంది. అలా మాట్లాడటం సరిదిద్దు కోవాలని నేను అతడికి సూచిస్తున్నట్లు తరుణ్ భాస్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం పోస్ట్ చేశారు.

    రకరకాలుగా మనిప్యులేట్ అవుతుంది

    రకరకాలుగా మనిప్యులేట్ అవుతుంది

    మనం మాట్లాడేది రకరకాలుగా మనిప్యులేట్ అవుతుంది. అది మీడియా వరకు వెళ్లిన తర్వాత దానిపై మనకు కంట్రోల్ ఉండదు. పైరసీ విషయంలో విశ్వక్ చాలా బాధపడ్డాడు. పోస్టర్లు చింపడం కాంట్రవర్సీ అయింది కాబట్టి దాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. మనం కష్టపడి సినిమా తీసినపుడు ఇలాంటివి జరిగితే చాలా బాధేస్తుంది. కొన్ని సార్లు జరిగిన పరిణామాలకు మనం బాధ పడాల్సి పరిస్థితులు ఏర్పడతాయి. నేను కూడా గతంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాన్నట్లు తరుణ్ భాస్కర్ తెలిపారు.

    మా మధ్య ఎలాంటి గొడవలు లేవు

    మా మధ్య ఎలాంటి గొడవలు లేవు

    విశ్వక్ అయినా, ఇతర యాక్టర్లు ఎవరైనా... మేము చాలా చిల్ ఉంటాం. ఆదివారం క్రికెట్ ఆడతాం. ఇన్ సెక్యూరిటీ, ఈగోలు మా మధ్య ఏమీ లేవు. మీరు కూడా ఏమీ ఊహించుకోవద్దు. మేము అందరం ఫ్రెండ్సే. మా మధ్య గొడవలు ఏమీ లేవని తరుణ్ భాస్కర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా విజయ్ దేవరకొండ, విశ్వక్ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు తరుణ్ భాస్కర్.

    ఇలాంటి పనికిరాని కొట్లాటలు వద్దు

    ఇలాంటి పనికిరాని కొట్లాటలు వద్దు

    మీకు ఇష్టమున్న యాక్టర్, డైరెక్టర్, సినిమాను ప్రేమించండి, అంతే కానీ నెగెటివ్‌గా ఉండకండి. అనవసరమైన ద్వేషాలు పెంచుకోవద్దు. మీరు ఏమైనా ఫైట్ చేయాలనుకుంటే మీ పేరెంట్స్ కోసం, దేశం కోసం చేయండి. లేదా ఇంకేమైనా పనికొచ్చేవి విషయాలపై చేయండి. సినిమాల విషయంలో గొడవలు పడితే ఏమీ రాదు. ఇలాంటివి మీరు త్వరలో తెలుసుకుంటారని... అభిమానులను ఉద్దేశించి తరుణ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.

    ఆ మాట అతడిని బాధించింది

    ఆ మాట అతడిని బాధించింది

    ఇప్పటికే ఒకడిని లేపినం, ఇపుడు ఇంకోడు వస్తున్నాడు అని ఇండస్ట్రీలో ఎవరో అన్నారంట... ఆ మాటే విశ్వక్‌కు కోపం తెప్పించింది. మనల్ని చూసి భయపడే వాళ్లు అలానే అంటారు. వారి వల్ల ఏమీ కాదు. ఇండస్ట్రీలో అందరి సినిమాలకు బిజినెస్ ఉంది. అందరి కెరియర్లు సెట్టవుతాయని... తరుణ్ భాస్కర్ తెలిపారు.

    విశ్వక్ సేన్ వయసు 23 సంవత్సరాలే...

    విశ్వక్ సేన్ వయసు 23 సంవత్సరాలే...

    విశ్వక్ ఈ వివాదాలను లైట్ తీసుకోవాలి. సినిమా బాగా వచ్చింది. రివ్యూల గురించి టెన్షన్ పడొద్దు. నేను కూడా కొన్ని సార్లు రివ్యూలు చూసి ఎందుకు ఇలా రాశారు అని తట్టుకోలేక పోతాను. విశ్వక్ సేన్ వయసు 23 సంవత్సరాలే. ఈ వయసులోనే యాక్టింగ్, డైరెక్షన్ చేశాడు. మున్ముందు అన్నీ నేర్చుకుంటాడు. ఫ్యూచర్లో ప్యాన్ ఇండియా లెవల్లో ఎదుగుతాడు. అపుడు అతడిని చూసి మనం గర్వ పడతాం... అని తరుణ్ భాస్కర్ తెలిపారు.

    English summary
    Director Tharun Bhascker Message To Vishwak Sen Over Falaknuma Das Controversy. Tharun Bhascker Dhaassyam is an Indian film director from Warangal, Telangana. He is known for directing the critically acclaimed Telugu language romantic comedy film Pelli Choopulu, which won him the National Film Award for Best Feature Film in Telugu and Best Screenplay - Dialogues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X