For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఎన్టీఆర్ 'రభస' లోనూ ఆ సీన్స్

  By Srikanya
  |
  Family Scenes Ntr's Rabhasa
  హైదరాబాద్: సినిమావాళ్లు ఎప్పుడూ ట్రెండ్ ని ఫాలో అవుతూంటారు. కామెడీ సినిమాలు ఆడుతూంటే పెద్దా,చిన్నా తేడా లేకుండా అందరూ అవే తీస్తూంటారు. ఈలోగా ఓ ఎమోషనల్ చిత్రం ఆడితే అదే ఫాలో అయ్యి ఆ తరహా సినిమాలు లేదా చేస్తున్న సినిమాలో ఆ సీన్స్ గుప్పించేస్తారు. ఇక ఈ మధ్య కాలంలో పెద్ద హిట్ అత్తారింటికి దారేది. ఫ్యామిలీలను టార్గెట్ చేసిన ఈ చిత్రం కూల్ గా రికార్డులు బ్రద్దలు కొట్టేసింది. దాంతో ఇప్పుడు రెడీ అవుతున్న చాలా చిత్రాలు అదే రూటుని ఫాలో అవుతున్నాయి. తమ చిత్రాల్లో కుటుంబాలని అలరించే సీన్స్ కొన్నైనా పెట్టాలని బావిస్తున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ తాజా చిత్రం 'రభస' లోనూ ఆ తరహా సీన్స్ తో రెడీ చేస్తున్నారు.

  అభిమానులకు కావల్సిన అన్ని అంశాలనూ అందిస్తూనే, కుటుంబ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాలూ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ సినిమా అంటే భారీ డైలాగులు, అదిరిపోయే ఫైట్స్, మైమరపించే డాన్స్ లు మాత్రమే కాదు. కుటుంబ బంధాలు కూడా ఉండాల్సిందే అంటున్నారు. ఇంటిల్లిపాదినీ మెప్పించాంటే.. ఈ మాత్రం కసరత్తు తప్పదని చెప్తున్నారు. ఎన్టీఆర్‌ నటిస్తున్న తాజా చిత్రంలోనూ కుటుంబ వాతావరణాన్ని రంగరిస్తున్నారు. దానికి తోడు సినిమాలో హీరోయిన్స్ ఇద్దరూ అత్తారింటికి దారేదిలో ఉన్నవాళ్లనే తీసుకున్నారు.

  ఎన్టీఆర్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కలయికలో ఈ 'రభస' చిత్రం రూపుదిద్దుకొంటోంది. సమంత, ప్రణీత హీరోయిన్స్. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత. రాజధానిలో చిత్రీకరణ జరుగుతోంది. కుటుంబ నేపథ్యంలో నడిచే కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాణగం పాల్గొంటున్నారు. మరో పది రోజుల పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరపనున్నారు. ఈ సీన్స్ సినిమాలో హెలెట్ అవుతాయంటున్నారు.

  బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ.... ' ఆ కుర్రాడికి దూకుడెక్కువ. మాటల్తో మడతెట్టేస్తాడు. చేతలతో పడగొట్టేస్తుంటాడు. తేడా వస్తే.. రభస చేయడానికి రెడీ అంటాడు. మరి ఆ జోరు ఎలా ఉంటుందో చూడాలంటే.. మా సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే. 'ఆది' తరవాత ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా ఇది. అభిమానులకు నచ్చేలా ఉంటుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా తీర్చిదిద్దుతున్నాం. మా సంస్థలో ఇది మరపురాని చిత్రం అవుతుంది'' అని చెబుతున్నారు.

  దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు.

  ఇక... ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు. ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.

  ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

  English summary
  Rabhasa is a action entertainer movie with Family emotions in which Jr Ntr will playing the main lead role along with Samantha in female lead.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more