»   » ఇదేం పిచ్చి దేముడోయ్: రక్తంతో ప్రేమలేఖ..,,షాక్ కు గురైన రకుల్ ప్రీతి సీంగ్

ఇదేం పిచ్చి దేముడోయ్: రక్తంతో ప్రేమలేఖ..,,షాక్ కు గురైన రకుల్ ప్రీతి సీంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అభిమానం పేరుతో ఫ్యాన్స్ చేసే పనులు ఒక్కోసారి చాలా ఇబ్బంది పెడుతూంటాయి స్టార్స్ ని. హీరో,హీరోయిన్స్ కు లవ్ లెటర్స్ రావటం మామూలే కానీ అదే రక్తంతో లవ్ లెటర్ రాస్తే వస్తే ...ఎలా ఉంటుంది. సదరు స్టార్స్ షాక్ అవుతారు.

అభిమానం హద్దులు దాటితే పిచ్చిగా మారి చేసే పనులని చూస్తూ ఏం చేయాలో అర్దం కాదు. తాజాగా ఓ వీరాభిమాని చేసిన పని స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను షాక్ లో ముంచెత్తింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.

వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా బాలీవుడ్‌ హీరోయిన్‌ సీరత్‌ కపూర్‌కు ఓ వీరాభిమాని రక్తంతో ప్రేమలేఖ రాశాడు. ఆ బీభత్సమైన అభిమాని తన చేతిమీద 'ఎస్' అంటూ కట్ చేసుకుని.. రక్తం చిందించాడు. ఆ రక్తాన్ని చిందించిన ఇమేజ్ ను శీరత్ కపూర్ కు షేర్ చేసి.. ఇది నీ కోసమే అన్నాడట.

దానితో హర్టయిన శీరత్.. దయ చేసి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. ఇలాంటి ప్రేమ మాపై చూపించొద్దు ప్లీజ్.. అంటూఆ వీరాభిమాని చేసిన ఈ పని తనకు ఎంతో ఆవేదన కలిగించిందని, దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేసింది సీరత్‌.

ముందుగా మీ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చుకోవాలని, తర్వాతే ఇతరులను అభిమానించాలని హితువు చెప్పింది. హీరోహీరోయిన్లపై అభిమానంతో మీకు మీరు హాని తలపెట్టుకోవద్దని నటుల అందరి తరపునా ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు స్పందించిన రకుల్.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. 'ఇది చాలా దారుణం. ప్రతి వ్యక్తి తనను తాను గౌరవించుకోవాలి. జీవితం చాలా విలువైనది' అని రీ ట్వీట్ చేసింది.

English summary
Back in the ’60s and ’70s, it wasn’t uncommon for actors like Savithri and Vanishree to receive fan mail written in blood. But today, with social media having made communication with Bollywood stars far more convenient, and less painful, you don’t hear of too many such instances. So, when Seeratg Kapoor recently found out that a fan had sent her a letter written in her blood, the actress was quite shocked.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu