Just In
- 52 min ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 1 hr ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 2 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 3 hrs ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
Don't Miss!
- News
ఏపీకి గుడ్ న్యూస్.. కర్నూలు విమానాశ్రయానికి డీజీసీఏ లైసెన్స్.. మార్చి నుంచి విమాన రాకపోకలు
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Finance
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్యూ 3 ఫలితాల కిక్ : 18% పెరిగిన నికర లాభం
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ అభిమాని నీచమైన పని చేసాడంటున్న నిఖిత
హైదరాబాద్: సాంకేతిక రంగం అభివృద్ది చెందిన తర్వాత సినిమా స్టార్లు, అభిమానుల మధ్య దూరం చాలా తగ్గి పోయింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లయిన ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటున్నారు స్టార్స్. ఇదంతా ఒక నాణేనికి ఒక వైపు మాత్రమే. వీటి వల్ల స్టార్స్ పలు సందర్భాల్లో ఇబ్బంది కూడా పడుతున్నారు. కొందరైతే ఏకంగా సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్స్ సైతం క్లోజ్ చేసారు.
తాజాగా హీరోయిన్ నిఖితకు ట్విట్టర్లో ఓ అభిమాని నుండి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అసభ్యకరమైన ఫోటోలు పంపాడు. అంతటితో ఆగకుండా ఇబ్బందికర వ్యాఖ్యలు కూడా చేసాడు. ఈ విషయాన్ని నిఖిత మీడియా దృష్టికి తీసుకొచ్చింది. అభిమానులు అభిమానుల్లా ఉండాలి. ఇలాంటి నీచమైన పనులు చేయొద్దని నిఖిత హెచ్చరించింది.

ఆమె సినిమాల విషయానికొస్తే....తెలుగు సినిమా ‘హాయ్' ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. తర్వాత ‘కళ్యాణ రాముడు', సంబరం, ఖుషీ ఖుషీగా, ఏమండోయ్ శ్రీవారు, అగంతకుడు, మహారాజశ్రీ, డాన్, అనసూయ, భద్రాద్రి, చింతకాయల రవి, అపార్టుమెంట్ చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం ఆమె రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అవును-2' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణె, పూర్ణ, సంజన తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2015లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.