»   » ‘వరల్డ్ పవనిజం డే’ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు

‘వరల్డ్ పవనిజం డే’ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయనకు మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారు. ఈ ఫాలోయింగ్ వెనక కేవలం పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్టింగ్ మాత్రమే కాదు....ఆయన గొప్ప మనసు, సింపుల్ లైఫ్ స్టైల్ కూడా ఓ కారణం.

అభిమానులంతా తమ ఐక్యత, ప్రత్యేక చాటుకునేందుకు తమ కంటూ ఓ రోజు ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే 'వరల్డ్ పవనిజం డే'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ డేను సృష్టించారు. గత కొన్నేళ్లుగా అక్టోబర్ 11వ తేదీని 'వరల్డ్ పవనిజం డే'గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్టాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, యూఎస్ఏ తదితర ప్రాంతాల్లోని పవన్ కళ్యాణ్ అభిమానులు ఇందుకు సిద్ధం అవుతున్నారు.

Fans Celebrate World Pawanism Day On 11th Oct

ఇదే రోజును ఎందుకు ఎంపిక చేసారంటే....పవన్ కళ్యాన్ నిటించిన తొలి సినిమా అక్టోబర్ 11, 1996లొ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆ డేట్ ఫిక్స్ చేసారన్నమాట. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఆదర్శంగా 'పవనిజం' కాన్సెప్టుతో సమాజానికి ఏదో ఒక మంచి చేద్దాం అనే ఉద్దేశ్యంతో అభిమానుంలంతా ముందుకు సాగుతున్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతూ యువత మంచి మార్గంలో నడిచే విధంగా చేయడమే పవనిజం లక్ష్యం.

'పవనిజం అంటే అదో అందమైన అభిమానుల ప్రపంచం. నా అభిమానులు నాకోసం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ఫంక్షన్లు చేయనక్కర్లేదు. నన్ను అభిమానించే అభిమానుల ప్రతి ఒక్కరి కళ్ళలోనూ చెరగని ఆనందాన్ని చూడాలనుకుంటాను. వాళ్ళు సమాజం పట్ల భాద్యత కలిగిన ఒక పౌరిడిగా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలనేది మాత్రమే వారి నుంచి ఆశిస్తున్నానని' గతంలో ఓ సారి పవన్ కళ్యాణ్ చెప్పారు.

English summary
Since yesterday, social media circles have been buzzing with the World Pawanism Day tag trending nonstop. Apparently, the diehard fans of Pawan Kalyan are celebrating October 11th as World Pawanism Day, to coincide Pawan's grand debut in Tollywood with Akkadammayi Ikkadabbayi on 11th October 1996.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu