For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దద్దరిల్లడం పక్కా: ఇప్పుడంతా 'కొడుకా.. కోటేశ్వరరావు' ఊపు.., పవన్ ఒక్కడే అందుకు అతీతం?

  |

  స్టార్ హీరోలు గొంతు సవరిస్తే.. సినిమాకు మరో ఎట్రాక్షన్ తోడైనట్లే. అందుకే పట్టుబట్టి మరీ దర్శకులు ఈమధ్య హీరోలతో పాటలు పాడిస్తున్నారు. అయితే ఈ పాడటం రొటీన్ వ్యవహారమై పోతే.. అభిమానులకూ మొహమొత్తి పోవడం ఖాయం.

  కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఇందుకు అతీతమనే చెప్పాలి. తమ్ముడు సినిమా నుంచి పవన్ పాడుతూనే ఉన్నా.. ఆయన పాట పాడిన ప్రతీసారి అభిమానులు ఇదే ఆయన తొలి పాట అన్నంతలా ఫీలవుతూ వస్తున్నారు. ఇప్పుడు అజ్ఞాతవాసి విషయంలోనూ అదే జరుగుతోంది.

  పవన్.. చించేసి ఉంటాడు?: ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూశారా?, ఆ పాట క్రేజ్ మామూలుగా లేదు..(పోటోలు)

  అభిమానులకు పవన్ ఫీవర్:

  అభిమానులకు పవన్ ఫీవర్:

  అజ్ఞాతవాసిలో పవన్ పాట పాడారని తెలియగానే అభిమానులకు ఒక రకమైన ఫీవర్ పట్టుకుంది. ఎప్పుడెప్పుడు పాట విందామన్న ఆత్రుత వారిని వెంటాడుతోంది. పాట వినాలన్న ఆత్రుత ఒకటైతే.. తెరపై ఆ పాటలో పవన్ ఎలా కనిపించబోతున్నారన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.

  అమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనం

  అప్పుడే 'హమ్' చేసేస్తున్నారు:

  అప్పుడే 'హమ్' చేసేస్తున్నారు:

  కొడుకా.. కోటేశ్వరరావు పాట ఎలా ఉండబోతుందో తెలియదు కానీ.. అభిమానులు మాత్రం ఎవరికి తోచిన రీతిలో వారు దాన్ని హమ్ చేయడం ఇప్పటికే మొదలుపెట్టారు. సాధారణంగా పవన్ అంటేనే పడి చచ్చే ఫ్యాన్స్.. ఇక ఆయన పాటకు ఎంతలా రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

  ఎవరీ కోటేశ్వరరావు?:

  ఎవరీ కోటేశ్వరరావు?:

  పవన్ 'కొడుకా.. కోటేశ్వరరావు..' పాట పాడినట్లు క్లారిటీ రావడంతో.. అసలేంటీ కోటేశ్వరరావు వ్యవహారం అన్న చర్చ కూడా జరుగుతోంది. సినిమాలో ఈ పేరును కేవలం పాటకే పరిమితం చేశారా?.. లేక ప్రత్యేకమైన పాత్ర ఏమైనా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  మందు పాటేనా?:

  మందు పాటేనా?:


  అత్తారింటికి దారేదిలో తప్పితే.. జానీ లోను, కాటమ రాయుడులోను పవన్ మందు పాటలే పాడారు. అయితే సామాజిక బాధ్యత గురించి తరుచూ ప్రస్తావించే పవన్.. ఇలా మందు పాటలను ఎంకరేజ్ చేయడమేంటి? అన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో ఇప్పుడొస్తున్న అజ్ఞాతవాసిలో పవన్ మందు పాటనే ఎంచుకున్నారా?, లేక త్రివిక్రమ్ మరేదైనా కొత్త తరహాలో చేయించారా? అన్న చర్చ జరుగుతోంది.

  ఆ మేనరిజమ్స్:

  ఆ మేనరిజమ్స్:

  డైలాగ్ చెప్పినా.. పాట పాడినా.. పవన్ మేనరిజమ్సే అందులో హైలైట్. కాటమరాయుడు పాటలో ముందుకు.. వెనక్కి ఊగుతూ.. ఒకవిధమైన జోష్‌లో ఆయన పాట పాడిన తీరు అభిమానులను ఒక ఊపు ఊపింది. ఇప్పడు అజ్ఞాతవాసిలోను పవన్ అలాంటి మేనరిజమ్స్‌తో అలరించడం ఖాయంగానే కనిపిస్తోంది.

  త్రివిక్రమ్ జోక్ పేల్చాడా?:

  త్రివిక్రమ్ జోక్ పేల్చాడా?:


  పవన్ పాడుతున్న సమయంలో ఆయనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్,మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, గీత రచయిత భాస్కర భట్ల, నిర్మాత రాధాకృష్ణ కూడా ఉన్నారు.

  పవన్ పాడుతున్న సమయంలో త్రివిక్రమ్ ఏదో జోక్ పేల్చినట్లు కూడా అనిపిస్తోంది. పవన్ ముసిముసిగా నవ్వుతుంటే.. త్రివిక్రమ్ తలవంచుకుని నవ్వుతున్న ఫోటోను చూస్తుంటే కచ్చితంగా ఆయనేదో జోక్ పేల్చి ఉంటారనిపిస్తుంది.

  దద్దరిల్లడం ఖాయం:

  దద్దరిల్లడం ఖాయం:

  పవన్ పాట రావడమే ఆలస్యం.. దాన్ని మోత మోగించడానికి అభిమానులు సిద్దమైపోయారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి పాట విడుదలవుతుండటంతో.. ఆరోజు రాత్రి న్యూ ఇయర్ వేడుకల్లోనూ ఈ పాట మారుమోగడం ఖాయం. న్యూ ఇయర్ కానుకగా పాట విడుదలవడం అభిమానులకు డబుల్ ధమాకా అనే చెప్పాలి. ఇక సినిమా విడుదలైతే థియేటర్లలోనూ ఈ పాట దద్దరిల్లడం ఖాయమే.

  English summary
  Powerstar Pawan Kalyan fans are eagerly waiting for his latest song in Agnyaathavasi movie. Buzz confirmed by movie unit, and it's going to release on Dec 31st.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X