»   » పవన్ పార్టీ ‘జన సేన’పై మీ స్పందనేంటి? (కామెంట్ ప్లీజ్)

పవన్ పార్టీ ‘జన సేన’పై మీ స్పందనేంటి? (కామెంట్ ప్లీజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ తెరంగ్రేటం, కొత్త పార్టీ గురించి గత కొంతకాలంగా జరుగుతున్న హాట్ టాపిక్ తాజాగా ఓ కొలిక్కి వచ్చింది. పార్టీ పేరు 'జనసేన' అని ఖరారు చేసినట్లు టక్. ఈ మేరకు దీన్ని ఎన్నికల సంఘంలో కూడా రిజిస్టర్ చేయించినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 14వ తేదీన పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన రాకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను? పార్టీ విధి విధానాలు ఏమిటి? భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అనే విషయాలను వెల్లడించనున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ తెరంగ్రేటం, కొత్త పార్టీపై మొదటి నుండీ మిక్స్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు అభిమానులు ఈ కుళ్లు రాజకీయాల్లోకి మీరు రావొద్దు అని అంటుంటే.....మరికొందరేమో పవన్ లాంటి వారు రావాల్సిన అవసరం ఉంది. ఈ కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

అభిమానుల బలంతోనే ఇంత ఎత్తుకు ఎదిగిన పవన్ కళ్యాణ్....రాజకీయ పార్టీ పెడుతున్న సమయంలోనూ వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ తెరంగ్రేటం గురించి ప్రెస్ మీట్ ఏర్పాటుకు ఒక రోజు ముందుగానే పవన్ తన అభిమానులో భేటీ కాబోతున్నారు. ఈ మేరకు పలువురు సీనియర్ అభిమానులకు పిలిచినట్లు తెలుస్తోంది . 13వ తేదీన జరిగే ఈ అభిమానుల సమావేశంలో పలు అంశాలను చర్చించబోతున్నట్లు సమాచారం. అభిమానుల సూచనలను కూడా పవన్ కళ్యాణ్ స్వీకరించనున్నాడని టాక్.

14వ తేదీన నిర్వహించే పబ్లిక్ ప్రెస్ మీట్‌తో పాటు, అభిమానుల మీటింగుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తెర వెనక ఉండి ఏర్పాట్లు చూసుకుంటున్న వారిలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు మరికొందరు పవన్ కళ్యాణ్ సన్నిహితులు ఉన్నట్లు తెలుస్తోంది.

మరి వపన్ కళ్యాణ్ కొత్త పార్టీ 'జనసేన'పై మీ అభిప్రాయాలు ఏమిటి అనేది కామెంట్ బాక్సులో తెలియజేయండి.....

English summary
According to the media reports, Pawan Kalyan’s party has been titled as Jana Sena Party. What is your opinion on his new party, comment below...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu