»   » ఆ సినిమా ఫ్లాప్.. అందుకే వైరాగ్యం.. అమెరికాలో పవన్

ఆ సినిమా ఫ్లాప్.. అందుకే వైరాగ్యం.. అమెరికాలో పవన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హర్వర్డ్ యూనివర్సిటీలో ఇండియా కాన్ఫరెన్స్ 2017లో పాల్గొనేందుకు వెళ్లిన పవన్ కల్యాణ్ నాషువాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో దాదాపు 50 నిమిషాలపాటు ప్రసంగించారు. తొలుత ఆంగ్లంలో ఆ తర్వాత తెలుగులో మాట్లాడి అభిమానులను ఆకట్టుకొన్నారు. చాలా ఉద్వేగపూరిత ప్రసంగాన్ని పవన్ కల్యాణ్ చేయడం గమనార్హం.

జానీ సినిమా సక్సెస్ అయితే..

జానీ సినిమా సక్సెస్ అయితే..

సినిమా రంగంలోకి ప్రవేశించినపుడు కేవలం ఏడు సినిమాలు చేసి పరిశ్రమ నుంచి నిష్క్రమిద్దామని అనుకొన్నాను. అయితే జానీ సక్సెస్ అయితే సినిమాలు మానేద్దామనుకొన్నాను. అది ఫ్లాప్ కావడంతో మరిన్ని సినిమాలు చేయాల్సి వచ్చింది. నాకు నిజజీవితంలో కొన్ని సమస్యలు ఉండేవని, దాంతో వైరాగ్యానికి గురయ్యాను. అందుకే సినిమాలు చేశాను.

సినీ ఇమేజ్‌ను ప్రజా సేవకు..

సినీ ఇమేజ్‌ను ప్రజా సేవకు..

‘సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్‌ను ప్రజా సేవకు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను. బాధ్యతలు పెరిగినప్పుడు సినిమాలకు దూరంగా ఉంటాను. అంతేగానీ సినిమాలకు దూరం కాను. సినిమా అంటే ఇష్టం. అయిష్టం లేదు. నటించడం వల్ల డబ్బులు కూడా వస్తాయి' అని పవన్ కల్యాణ్ తెలిపారు.

సూటు, బూటు.. మెడలో ఎర్ర టవల్

సూటు, బూటు.. మెడలో ఎర్ర టవల్

అమెరికాలో సూటు-బూటు వేసుకుని కూడా మెడలో ఎర్ర తువాలు వేసుకొని పవన్ కల్యాణ్ కనిపించారు. మెడలో వేసుకొన్న ఎర్ర టవల్ ను చూపించి 'ఇది ఒక సామాన్యుడి సింబల్' అని చెప్పారు. పవన్ మాట్లాడుతున్నంత సేపు అభిమానులు కేరింతలతో సందడి చేశారు.

యూఎస్‌లో జైహింద్.. భారత్ మాతా కీ జై

యూఎస్‌లో జైహింద్.. భారత్ మాతా కీ జై

తన ప్రసంగంలో రాజకీయ పార్టీ ఏర్పాటు, ఉద్దేశాలు, ప్రణాళికలను పవన్ వివరించారు. ప్రసంగం చివర్లో ‘జైహింద్', ‘భారత్ మాతా కీ జై' అని ఆయన నినాదాలు చేశారు. అభిమానులు, సభకు హాజరైన వారందరితోనూ జై కొట్టించారు. పవన్ అమెరికా పర్యటనకు మంచి స్పందన కనిపిస్తున్నది.

English summary
Pawan Kalyan spokes at Nashua for a talk. He talks about politics his unintended entry into films, philosophies and his aspirations foraying into politics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu