»   » అతని కూతురంటే నమ్మను డీ‌ఎన్‌ఏ టెస్ట్ చేయించండీ..!: బాలీవుడ్ దర్శకురాలి వ్యాఖ్య

అతని కూతురంటే నమ్మను డీ‌ఎన్‌ఏ టెస్ట్ చేయించండీ..!: బాలీవుడ్ దర్శకురాలి వ్యాఖ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే కూతురు అనన్యా పాండే ఇంకా బాలీవుడ్‌ దిశగా అడుగులు వేయడం లేదు కానీ, తనకి బాలీవుడ్‌ హీరోయిన్లకి తీసిపోని బాడీ వుందని మాత్రం సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. 18 ఏళ్ళకే బాలీవుడ్ హీరోయిన్లతో సమానంగా ఫాలోయింగ్ ఉన్న ఈ పిల్ల ఈమధ్య సోషల్ మీడియాలో కొత్త సంచలనం అయ్యింది అదీ ఆమెకు సంబందం లేకుండానే.... ఇంతకీ ఏమయ్యిందీ అంటే...!

అనన్య ఫొటోను ఆమె తల్లి భావన పాండే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. కాసేపట్లోనే ఈ ఫొటో వైరల్‌గా మారింది. అనన్య అందం అదుర్స్‌ అంటూ ఎంతోమంది నెటిజన్లు కితాబిచ్చారు. అయితే, అంతకుమించి అన్నట్టు ఈ ఫొటోపై బాలీవుడ్‌ దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫర్హా ఖాన్‌ బాంబులాంటి కామెంట్‌ చేసింది.

Farah Khan refuses to believe Ananya is Chunky Pandey's daughter

అనన్య చుంకీపాండే కూతురంటే నమ్మలేం.. డీఎన్‌ఏ పరీక్ష చేయించాలంటూ ఆమె పేర్కొన్నారు. సరదాగా ఆటపట్టించేందుకు ఆమె పెట్టిన ఈ కామెంట్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయింది. అసలే బాలీవుడ్ లో బూతు జోకులకు కేరాఫ్ అడ్రస్ అయిన ఫరాఖాన్ ఇలా అసలు చుంకీ కి పుట్టలేదు అనే అర్థం తో అంత మాట అనేసినా లైట్ తీస్కోవటం మాత్రం వింతగానే ఉంది...

క్యూట్‌గా ఉన్న అనన్య ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1700లకుపైగా లైకులు వచ్చాయి. ఎంతోమంది కామెంట్‌ పెట్టారు. ఫర్హా ఖాన్‌ కూడా సరదాగా స్పందిస్తూ.. 'దయ చేసి డీఎన్‌ఏ పరీక్ష చేయించండి. తను చుంకీ కూతురంటే నమ్మలేం. చాలా లవ్లీగా ఉంది' అంటూ లాఫ్టర్ ఎమోజీతో కామెంట్‌ చేసింది.

❤️

A post shared by Bhavana Pandey (@bhavanapandey) on Aug 16, 2017 at 9:23am PDT

English summary
Chunky’s wife, Bhavana shared a picture of their daughter last week., “Do a dna test pls.. shes too lovely to b chunkys child,” Farah wrote with a laughter emoji.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu