»   » ఓ వైపు విడాకులు, బార్లో పార్టీ చేసుకున్న హీరో భార్య ? (ఫోటోస్)

ఓ వైపు విడాకులు, బార్లో పార్టీ చేసుకున్న హీరో భార్య ? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, భాగ్ మిల్ఖా భాగ్ ఫేం పర్హాన్ అక్తర్ ఇటీవల తన భార్య అధునా అక్తర్ కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరం ఒక మ్యూచువల్ అండర్ స్టాండింగుతో విడిపోతున్నట్లు ప్రకటించారు. మగాళ్ల సంగతేమోగానీ, మహిళలకు మాత్రం విడాకులు కాస్త మింగుడు పడని అంశమే.

వీరి మధ్య విడాకులకు పర్హాన్ అక్తర్ వేరే హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకోవడమే అనే కారణం కూడా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధునా అక్తర్ విడాకుల విషయంలో లోలోపల ఎంతో కొంత బాధపడుతూ ఉంటుందని అంతా భావిస్తారు. అయితే ఆమె ఇటీవల అందుకు భిన్నంగా ముంబైలోని ఓ బార్లో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విడాకుల ప్రకటన తర్వాత ఆమె తొలిసారి ఇలా బయట కనిపించారు.

ఆ హీరోయిన్ మాటల్లో అర్థం ఏమిటి? ఎఫైర్ ఒప్పుకుందా?

ఈ పార్టీలో ఆమె ఎంజాయ్ చేసిన తీరు చూస్తుంటే.... విడాకుల విషయంలో ఆమెకు ఎలాంటి బాధ లేదని స్పష్టమవుతోంది. ఈ పార్టీలో ఆమె ఎంతో సంతోషంగా కనిపించారు. ఫుల్ జోష్ గా చిందులేసారు. తన ఫ్రెండ్స్ తో కలిసి బెస్ట్ టైం గడిపారు.

దర్శకుడు పర్హార్ అక్తర్, ఆయన భార్య అధునా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో 15 ఏళ్ల వీరి వివాహ బంధానికి తెరపడబోతోంది. విడిపోవాలనే అంశంపై ఇద్దరం ఒక నిర్ణయాని వచ్చామని, సామరస్య పూర్వకంగా విడిపోతున్నామని ప్రకటించారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, పార్టీకి సంబంధించిన ఫోటోస్...

పిల్లల కోసం

పిల్లల కోసం

తాము విడిపోయినప్పటికీ...పిల్లల పెంపకం విషయంలో ఇద్దరం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని, మేము విడిగా ఉంటున్నా అత్యంత ప్రాధాన్యత వారికే ఉంటుందని తెలిపారు.

హుందాగా

హుందాగా

హుందాగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు అని బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

పర్హాన్ వయసులో చిన్న

పర్హాన్ వయసులో చిన్న

పర్హాన్ అక్తర్ తనకంటే దాదాపు ఏడేళ్లు ఎక్కువ వయసున్న అధునా భబానిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం పర్హాన్ వయసు 42, అధునా వయసు 49.

అలా..

అలా..

దిల్ చాహతాహై సినిమాతో పర్హార్ నటుడిగా పరిచయం అయ్యాడు. అదే సినిమాకు హెయిర్ స్టైలిస్ట్ గా పని చేసింది అధునా భబాని. ఈ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

English summary
Farhan Akhtar's ex-wife Adhuna Akhtar, celebrated her breakup recently and was seen partying with a bunch of friends at the Asia Bar, which is situated in Pheonix Marketcity Kurla, in Mumbai.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu