twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూత్‌కు కనెక్ట్ అయ్యే ఫీల్‌గుడ్ మూవీ ‘పాఠశాల’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మూన్ వాటర్ పిక్చర్స్ వారు నిర్మించిన 'పాఠశాల' ఇటీవల విడుదలై ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకుంది. మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో రాకేశ్ మహంకాళి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయి రోనక్, అనుప్రియ, నందు, శిరీష, హమూద్ నటీనటులు. శశాంక్ కీలక పాత్ర పోషించాడు. రాహుల్ రాజ్ సంగీతం అందించారు.

    పాఠశాల - పూర్తి సినిమా వీక్షించండి

    నాలుగేళ్లు కలిసి చదువుకున్న ఐదుగురు స్నేహితులు, కాలేజీ పూర్తయిన ఒకరికొకరు దూరం అవుతున్నామనే బాధను మరిచిపోవడానికి అంతా కలిసి జాయ్ ఫుల్ జర్నీ చేయాలనుకుంటారు. ఒకరి ఊరికి ఒకరు వెళ్లి సరదాగా గడుపుతారు. ఈ క్రమంలో ఆ స్నేహితుడి ఇంట్లో గడిపిన ఆ నాలుగు రోజులు , నాలుగేళ్లగా తెలిసిన ఆ స్నేహితుడినే కొత్తగా పరిచయం చేస్తుంది. వాళ్ళకి తెలిసిన స్నేహితుల గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటారు. పదహారేళ్ళు చదువుకున్నప్పుడు నేర్చుకోని పాఠాలు, ఆ ఒక్క ప్రయాణంలో నేర్చుకుంటారు. ఆ ఒక్క ప్రయాణం జీవితం గురంచి నేర్పించిన పాఠమే ఈ ‘పాఠశాల'.

    Feel good entertaining film Patashala

    ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదు, అలాగే ఫుల్ లెంగ్త్ రోడ్ మూవీ జోనర్ ఇది. ఈ సినిమాలో మెయిన్ రోల్ చేసింది 5 మంది....వీరి పాత్రలు ప్రేక్షకుల రిలయ్ లైఫ్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. నందు పాత్ర చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఈ పాత్ర సినిమా మొత్తం ఒకేలా బిహేవ్ చేస్తూ నవ్విస్తూ ఉంటుంది. సినిమా కథని మనకు చెప్పే సూర్య పాత్ర చేసిన శివ బాగా సెటిల్ గా పెర్ఫార్మన్స్ చేసాడు. ఈ పాత్ర ఇప్పటి యువతరంలోని చాలా మందికి సింక్ అవుతుంది. అలాగే సాల్మా పాత్ర చేసిన శిరీష్ కూడా ఈ తరం అమ్మాయిలను బాగా ఆకట్టుకుంటుంది. శశాంక్ పాత్ర సినిమాకి చాలా కీలకం. తన పాత్రతోనే సినిమా టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది. క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. మరి ఇంకెందుక ఆలస్యం.... కాలేజీ రోజుల్లో మీ ఫ్రెండ్స్‌తో గడిపిన రోజులను గుర్తు చేసే ఈ మూవీని మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

    English summary
    Paathshala is quite a different and sensible film in this day and age. It nicely showcases the problems and aspirations of the youth in a decent and entertaining manner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X