»   » ‘ఫిదా’.... ఒక టిక్కెట్ కొంటే మరో టికెట్ ఉచితం

‘ఫిదా’.... ఒక టిక్కెట్ కొంటే మరో టికెట్ ఉచితం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓవర్సీస్ ప్రేక్షకులు బాగా ఆదరించే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఫీల్ గుడ్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్‌ను అందంలం ఎక్కించే ఎన్నారైలు ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాను సూపర్ హిట్ చేశారు.

వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం యూఎస్ఏలో 1.6 మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ అయింది. 2017 సంవత్సరంలో యూఎస్ఏలో 3వ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.


2 మిలియన్ గ్యారంటీ...

2 మిలియన్ గ్యారంటీ...

‘ఫిదా' మూవీకి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే ఈ సినిమా ఫుల్ రన్ లో 2 మిలియన్ డాలర్ మార్కును అందుకోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.


Fidaa Movie is Replica of Telangana Tradition
ఫిదా అభిమానులకు బంపర్ ఆఫర్

ఫిదా అభిమానులకు బంపర్ ఆఫర్

యూఎస్ఏలో ఇంకా ‘ఫిదా' చూడని అభిమానులకు, మరోసారి చూద్దామనుకునే ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. AT&T కష్టమర్లకు ఫిదా టికెట్ ఒకటి కొంటే మరో టికెట్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ యూఎస్ఏలోని మూవీటికెట్స్.కామ్‌తో టైఅప్ అయిన రీగల్, ఎఎంసి, కొన్ని ప్రైవేట్ థియేటర్లలో చెల్లు బాటు అవుతుంది.


రిపీటెడ్ ఆడియన్స్‌ను రప్పించేందుకే

రిపీటెడ్ ఆడియన్స్‌ను రప్పించేందుకే

‘ఫిదా' సినిమా చూసిన వారు మైండ్ లో నుండి భానుమతి పోవడం లేదని, మరోసారి వెళ్లి ఆమెను చూస్తే తప్ప సంతృప్తి ఉండదను అనే భావనలో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన లోకల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.


రూ. 50 కోట్ల కలెక్షన్

రూ. 50 కోట్ల కలెక్షన్

‘ఫిదా' సినిమా ఇంత పెద్ద హిట్టవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ చిత్రం విడుదలైన 2 వీక్స్ లోపే రూ. 50 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం క్రియేట్ చేసింది. వరుణ్ తేజ్ కెరీర్లో ఇదే అతిపెద్ద హిట్. ఇక సాయి పల్లవి అయితే తెరంగ్రేటంలోనే తనకు ఇంత ఆదరణ లభించడంతో చాలా హ్యాపీగా ఉంది.English summary
Darling of overseas Sekhar Kammula, Mega Prince Varun Tej and Super Natural performer Sai Pallavi’s Fidaa crossed $1.6 million in USA and has become a 3rd biggest grosser of 2017. We are expecting to reach another mile stone of $2 million in full run. Tuesday is here and AT&T customers take advantage of Buy 1 get one free offer from AT&T. This offer is valid for all Regal, AMC some other private theaters that patriciate with www.movietickets.com.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu