»   » అల్లు అరవింద్ గారు.. మీరు ఇక వెళ్లొచ్చు.. వెళ్లండి.. ఆర్ నారాయణమూర్తి హల్‌చల్

అల్లు అరవింద్ గారు.. మీరు ఇక వెళ్లొచ్చు.. వెళ్లండి.. ఆర్ నారాయణమూర్తి హల్‌చల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్న చిత్రం ఫిదా. అమెరికాతోపాటు తెలుగు రాష్ట్రాల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్‌రాజు హైదరాబాద్‌లో ఫిదా సంబురాలు పేరుతో ఓ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో, హీరోయిన్లు వరుణ్ తేజ్, సాయి పల్లవి, చిత్రంలో నటించిన నటీనటులు, చిత్ర యూనిట్ హాజరైంది. ఈ కార్యక్రమంలో నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తన ప్రసంగంతో హల్‌చల్ చేశాడు.

వేడుకలో అనుకోని అతిథి

వేడుకలో అనుకోని అతిథి

వాస్తవానికి ఈ వేడుకకు ఆర్ నారాయణమూర్తి ఆహ్వానితుడు కాదు. సంబరాల సందర్భంగా పటాకులు కాల్చుతుంటే ఏం జరుగుతుందని ప్రసాద్ ల్యాబ్‌కు వచ్చిన నారాయణమూర్తిని వేదికపైకి ఆహ్వానించారు. ఆ సమయంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతుండటంతో వేదిక మెట్లమీదే నిలబడి విన్నారు.

Sai Pallavi And Fidaa Going Crazy All Over
అల్లు అరవింద్ మీరు ఉండండి..

అల్లు అరవింద్ మీరు ఉండండి..

అల్లు అరవింద్ తన ప్రసంగాన్ని ముగించి వ్యక్తిగత పని ఉందంటూ వెళ్తానని నిర్మాత దిల్ రాజుకు చెప్పి బయలుదేరుతుండగా ఆయనను కాసేపు ఉండమని నారాయణమూర్తి చెప్పాడు. ఇక ప్రసంగం మొదలుపెట్టిన నారాయణమూర్తి దడదడలాడించారు.

అరవింద్‌ది గొప్ప మనసు

అరవింద్‌ది గొప్ప మనసు

వరుస విజయాలతో దూసుకెళ్తున్న దిల్‌రాజును అభినందించిన అరవింద్‌ను నారాయణమూర్తి ప్రశంసలతో ముంచెత్తారు. అల్లు అరవింద్ కూడా ఘన విజయాలు సాధించారని, అలాంటి వ్యక్తి తోటి నిర్మాత విజయాలను మనసారా అభినందించడం గొప్ప విషయం అని ఆయన అన్నారు.

దిల్ రాజుకు అనితమ్మ దీవెనలు

దిల్ రాజుకు అనితమ్మ దీవెనలు

దిల్ రాజు ఈ ఏడాదిలో నాలుగు బ్లాక్‌బస్టర్లు అందించారు. ఇక రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. నిర్మాతగా ఆయన ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆయన విజయాల వెనుక పరలోకంలో ఉన్న ఆయన సతీమణి అనిత దీవెనలే కారణం అని ఆయన అన్నారు.

అల్లు అర్జున్‌తో బయోపిక్ తీయండి

అల్లు అర్జున్‌తో బయోపిక్ తీయండి

ఇటీవల విడుదలైన దువ్వాడ జగన్నాథం సినిమాలో డ్యాన్సులతో దుమ్మురేపాడు. ఆయన డ్యాన్సులు చూసి ఫిదా అయ్యాను. అలాంటి బిడ్డను కన్న అరవింద్ నిజంగా ధన్యుడే అని నారాయణ మూర్తి పేర్కొన్నారు. అంతేకాకుండా దిల్ రాజుకు ఓ రిక్వెస్ట్ కూడా చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చిన డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్రను బయోపిక్‌గా తీయాలని, అందులో అల్లు అర్జున్‌ను హీరోగా పెట్టాలి అని సూచించారు.

నా చెప్పాను.. మీరు వెళ్లండి అరవింద్ గారు..

నా చెప్పాను.. మీరు వెళ్లండి అరవింద్ గారు..

అనంతరం అల్లు అరవింద్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను మీ అబ్బాయి గురించి నాలుగు ముక్కలు చెప్పాలనుకొన్నాను. మీరు ఉంటే బాగుంటుంది అని మిమ్మల్ని ఆపాను. అల్లు అరవింద్ గారు ఇక మీరు వెళ్లవచ్చు. మీరు వెళ్లండి అంటూ తనదైన శైలి మాట్లాడారు. నారాయణ మూర్తి మాట్లాడినంత సేపు ఆహ్వానితులందరూ నవ్వుల్లో మునిగిపోయారు. అంతేకాకుండా ఆయన మాట్లాడినంత సేపు ఈలలు, చప్పట్లతో హంగామా చేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా క్లాస్‌గా నిర్వహించాలనుకొన్నాం. కానీ నారాయణమూర్తి వచ్చి దీనిని మాస్ కార్యక్రమంగా మార్చారు అని దిల్‌రాజు అనడం గమనార్హం.

శేఖర్ కమ్ముల మరో హృషికేష్ ముఖర్జీ

శేఖర్ కమ్ముల మరో హృషికేష్ ముఖర్జీ

ఇక ఫిదా డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుతూ.. ఆయన తెలుగు హృషికేష్ ముఖర్జీ, గుల్జార్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. గోదావరి అద్భుతంగా చూపించిన వారిలో ఆయన ఒకరు. శేఖర్ కమ్ముల పిధా చూసి నేను ఫిదా అయిపోయాను. ఆంధ్రా ప్రాంతానికి చెందిన శేఖర్ కమ్ముల తెలంగాణ యాసను, సంప్రదాయాలను అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. తెలంగాణ ప్రాంత సంప్రదాయాలు పుష్కలంగా ఉన్న సినిమాను ఆంధ్రా ప్రాంతం వారు ఆదరించడం మంచి పరిణామం అని అన్నారు.

English summary
Fidaa movie gets huge response all over the world. This movie become blackbuster. In this occassion, Producer Dil Raju conducted Fidaa Sambaralu ceremony. Many stars of the movie attended for this event. Director R Narayana Murth also part of the event. His speech get huge response from the invitees.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu