»   »  ఎన్నికల్లో సినీ స్టార్స్: ఎవరు ఓడారు, ఎవరు గెలిచారు?

ఎన్నికల్లో సినీ స్టార్స్: ఎవరు ఓడారు, ఎవరు గెలిచారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సారి ఎన్నికల్లో అత్యధిక మంది సినిమా తారలు పోటీ చేసారు. ఎన్నడూ లేని విధంగా పలువురు బాలీవుడ్ తారలు భారీ సంఖ్యలో వివిధ పార్టీల నుండి బరిలో నిలిచారు. ఇందులో కొందరు రాజకీయాలకు పూర్తిగా కొత్తవారు కాగా, కొందరు మాత్రం గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న వారే.

పలువురు తారలు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి పోటీ చేయగా బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఏ పార్టీ నుండి పోటీ చేసే అవకాశం రాక పోవడంతో సొంతగా పార్టీ స్థాపించి మరీ ఓన్నికల బరిలో నిలిచింది. ఇక మన రాష్ట్ర నుండి వైసీపీ తరుపున రోజా, తెలుగు దేశం పార్టీ తరుపున బాలకృష్ణ, మురళీ మోహన్ లాంటి వారు బరిలో నిలిచారు.

మరి ఈ సారి ఎన్నికల్లో పోటీకి దిగిన సినీ తారల వివరాలు, గెలుపు, ఓటములకు సంబంధించిన విషయాలపై ఓ లుక్కేద్దాం....

బాలకృష్ణ

బాలకృష్ణ

తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగి తెలుగుదేశం పార్టీ తరుపున హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘన విజయం సాధించారు.

రోజా

రోజా

తెలు నటి రోజా వైసీపీ నుండి బరిలోకి దిగి నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించారు.

మురళీ మోహన్

మురళీ మోహన్

తెలుగు నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ తెలుగుదేశం పార్టీ తరుపున రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసి గెలుపొందారు.

కిర్రన్ ఖేర్

కిర్రన్ ఖేర్

బాలీవుడ్ నటి కిర్రన్ ఖేర్, గుల్ పనాగ్ ఇద్దరూ చండీఘర్ పార్లమెంటు నియోజకర్గంలో ఒకరిపై ఒకరు పోటీకి దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున పోటీ చేసిన గుల్ పనాగ్....బీజేపీ అభ్యర్థి కిర్రన్ ఖేర్ చేతిలో ఓటమి పాలయ్యారు.

పరేష్ రావల్

పరేష్ రావల్

బీజేపీ టికెట్ పై గుజరాత్ లోని అహ్మదాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన పరేష్ రావల్ గెలుపొందారు.

రాఖీ సావంత్

రాఖీ సావంత్

రాష్ట్రీయ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి ముంబై నుండి పార్లమెంటుకు పోటీ చేసిన బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఓటమి పాలయ్యారు.

రాజ్ బబ్బర్

రాజ్ బబ్బర్

ఉత్తరప్రదేశ్ గజియాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ ఓటమి పాలయ్యారు.

జయసుధ

జయసుధ

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన జయసుధ ఓటమిపాలయ్యారు.

జయప్రద

జయప్రద

రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీ నుండి ఉత్తరప్రదేశ్‌లో పోటీ చేసిన నటి జయప్రద ఓటమి పాలయ్యారు.

మనోజ్ తివారి

మనోజ్ తివారి

భారతీయ జనతా పార్టీ తరుపున ఎన్నికల బరిలోకి దిగిన బాలీవుడ్ నటుడు మనోజ్ తివారి గెలుపొందారు.

ప్రకాష్ ఝా

ప్రకాష్ ఝా

బీహీర్ నుండి పోటీ చేసిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ప్రకాష్ ఝా ఓటమి పాలయ్యారు.

శతృఘ్న సిన్హా

శతృఘ్న సిన్హా

భారతీయ జనతా పార్టీ నుండి పాట్నా నుండి బరిలోకి దిగిన బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా ఘన విజయం సాధించారు.

బప్పీ లహరి

బప్పీ లహరి

ఎన్నిక బరిలో దిగిన బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీ లహరి కోల్ కతాలోని శ్రీరాంపూర్ నుండి బీజేపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

రమ్య

రమ్య

కన్నడ నటి రమ్య కూడా ఓటమి అంచులో ఉన్నారు. గతేడాది ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన రమ్య ఈ సారి ఓటమి దిశగా ప్రయాణిస్తున్నట్లు ఇప్పటి వరకు అందిన సమాచారం బట్టి తెలుస్తోంది.

నగ్మా

నగ్మా

కాంగ్రెస్ పార్టీ రుపున మీరట్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

రవి కిషన్

రవి కిషన్

ఇటీవల రేసు గుర్రం చిత్రంలో విలన్ గా నటించిన బోజ్ పురి నటుడు రవి కిషన్ కాంగ్రెస్ పార్టీ తరుపున జాన్ పూర్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

గుల్ పనాగ్

గుల్ పనాగ్

బాలీవుడ్ నటి గుల్ పనాగ్ ఆమ్ఆద్మీ పార్టీ తరుపున చండీగర్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

English summary
Narendra Modi led Bharatiya Janata Party has already started distributing laddoos among themselves in celebration of their grand victory in the 2014 LS polls. But there are couple of Bollywood celebrities who also contested the polls from different parties and constituencies aspiring to have the sweet smell of success. Although, some of the Bollywood stars came out with smiles on their faces, there are a couple others who had to leave the arena without much to be happy about.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu