twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమిత్ షాపై అనుచిత పోస్టు.. డైరెక్టర్ ను కాపు కాసి అరెస్ట్ చేసిన పోలీసులు!

    |

    సినీ దర్శకుడు అవినాష్ దాస్‌ను ముంబైలో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని క్రైం బ్రాంచ్ డీసీపీ చైతన్య మాండ్లిక్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌ను షేర్ చేయడంతో ఆ విషయంలో అవినాష్ పై ఈ చర్యలు తీసుకున్నారు. అవినాష్ తన సోషల్ మీడియా ఖాతా నుండి వివాదాస్పద పోస్ట్‌ను పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక అవినీతి కేసులో అరెస్ట్ అయిన అధికారిణి అమిత్ షాతో కలిసి ఉన్నట్టు ఉన్న ఫోటో ఆయన షేర్ చేశారు. దీనిపై అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసింది. తదుపరి చర్యల కోసం పోలీసులు వారిని అహ్మదాబాద్‌కు తీసుకువస్తున్నారు. అరెస్టయిన అధికారి పూజా సింఘాల్‌తో హోం మంత్రి అమిత్ షా ఉన్న ఫోటోను షేర్ చేసినందుకు చిత్ర దర్శకుడు అవినాష్ దాస్‌ను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ముంబైకి చెందిన అవినాష్ దాస్‌ను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమిత్ షా పూజా సింఘాల్‌తో కలిసి దిగిన ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మంగళవారం ముంబై నుంచి అవినాష్ దాస్‌ను అదుపులోకి తీసుకున్నామని అహ్మదాబాద్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ డీపీ చుడసామా కూడా తెలిపారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం మా బృందం వారిని అహ్మదాబాద్‌కు తీసుకువస్తోంది. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అవినాష్ దాస్‌పై సెక్షన్ 469 (చీటింగ్) కింద కేసు నమోదు చేసిందని అన్నారు. దీంతో పాటు ఐటీ చట్టం, జాతీయ చిహ్నాలను అవమానించిన సెక్షన్ల కింద కూడా కేసు నమోదైంది. అవినాష్ దాస్ ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో ఒక మహిళ చిత్రాలను కూడా పంచుకున్నారు, అందులో ఆమె త్రివర్ణ పతాకాన్ని ధరించి కనిపించింది. మనీలాండరింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.

    Film Director Avinash Das Was Detained By Gujarat Police

    దీని తర్వాత అవినాష్ దాస్ అమిత్ షాతో పూజా సింఘాల్ తో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు.ఈ కేసులో అవినాష్ దాస్ ముందస్తు బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు, అయితే ఆయన దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.'అనార్కలి ఆఫ్ ఆరా' చిత్రాన్ని రూపొందించిన అవినాష్ దాస్‌ను అదుపులోకి తీసుకునేందుకు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ బృందం గత వారం రోజులుగా ముంబైలో క్యాంప్ వేసింది. ఇక అలా అవినాష్ దాస్ ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తుండగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అవినాష్ దాస్ షేర్ చేసిన ఫోటో 2017లో జరిగిన ఒక ఈవెంట్ కు సంబంధించినదని తెలుస్తోంది. ఈ ఫోటోలో పూజ సింఘాల్ హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ ఫోటో కారణంగా అమిత్ షా గౌరవాన్ని దెబ్బతీసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ఆయనపై కేసు నమోదైంది.

    English summary
    Filmmaker Avinash Das Detained For Sharing Amit Shah's Photo With Arrested Bureaucrat pooja singhal in mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X