twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేశ వ్యాప్తంగా ‘ఆర్టికల్ 370’ కల్లోలం... సినీ స్టార్లు ఏమంటున్నారంటే!

    |

    Recommended Video

    #Article370 : Film Stars Expressed Happiness Over The Cancellation Of Article 370 || Filmibeat

    కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు కేంద్ర కేబినెట్‌లో పాసైన వెంటనే రాష్ట్రప‌తి ఆమోదం పొందుతూ గ‌జెట్ విడుద‌లైంది. దీంతో 70 ఏళ్లుగా కశ్మీర్ విషయంలో కొనసాగుతున్న ప్రత్యేక ప్ర‌తిప‌త్తి ర‌ద్ద‌యినట్లయింది. ఆర్టికల్‌ 370 రద్దుతో పాటు జమ్ము, కశ్మీర్‌లు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా, లద్దాక్‌‌ను అసెంబ్లీ లేని యూనియన్ టెర్రిటరీగా ప్రకటించారు. ఆర్టికల్‌ 370 విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పలువురు సినీ స్టార్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

    జై హింద్ అంటూ దర్శకుడి ఆనందం

    ఇక జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉండదు, ద్వంద్వ పౌరసత్వం ఉండదు, భారతీయులు అందరూ జమ్మూ కశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేయొచ్చు, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక జెండా అంటూ ఏమీ ఉండదు... ఇక పై మన భారత దేశం 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు. జై హింద్.... అంటూ దర్శకుడు మెహర్ రమేష్ ట్వీట్ చేశారు.

    ఇకపై ఎవరైనా అలా చేస్తే డిక్కీ భజాయించుడే

    ఇకపై ఏ పాకిస్థానీ కూడా కాశ్మీర్ అమ్మాయిన పెళ్లి చేసుకోవడం ద్వారా కాశ్మీరీ కాలేడు. అన్నింటికంటే ముఖ్యంగా ఎవరైన అక్కడ భారత జాతీయ జెండాను అగౌరవ పరిస్తే డిక్కీ భజాయిస్తారు.... అంటూ నిర్మాత ఎస్.కె.ఎన్ ట్వీట్ చేశారు.

    లావణ్య త్రిపాఠి ఆనందం

    ఆర్టికల్‌ 370 రద్దు చేయడంపై హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో గర్వంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. పలువురు అభిమానులు సైతం ఆర్టికల్‌ 370 రద్దుపై హర్షం వ్యక్తం చేశారు.

    నా జీవితంలోనే గొప్ప న్యూస్ వింటూ నిద్ర లేచా

    కాశ్మీర్ గురించి నా జీవితంలోనే ఒక గొప్ప న్యూస్ వింటూ న్యూయార్కులో నిద్రలేచాను. ఇదే రోజున నా ఆటోబయోగ్రఫీ రిలీజైంది. ఒక కాశ్మీరీ అబ్బాయికి ఇంతకంటే బెటర్ గిఫ్ట్ ఏమి ఉంటుంది? ఆ దేవుడితో పాటు భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ, అమితా షాకు థాంక్స్. భారత దేశానికి కంగ్రాట్స్... అంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.

    యునైటెడ్ ఇండియా కోసం అమరులైన వీరులందరికీ ఇది గొప్ప నివాళి

    యునైటెడ్ ఇండియా కోసం అమరులైన వీరులందరికీ ఇది గొప్ప నివాళి. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాకు హాట్స్ ఆఫ్... దేశ భక్తికలిగిన ప్రతి భారతీయుడి తరుపున బిగ్ థాంక్స్ అంటూ వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేశారు.

    English summary
    Film stars expressed happiness over the cancellation of Article 370. They hailed it as a historic decision taken by the Government of India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X