twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళికి షాక్.. ఆ దేశంలో పిల్లలకు అనుమతిలేదట.. బాహుబలిపై సెన్సార్ ఆంక్షలు

    By Rajababu
    |

    ప్రపంచవ్యాప్తంగా భాషాబేధం లేకుండా బాహుబలి2 చిత్రాన్ని ఆదరిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే బాహుబలి2 మాత్రం సింగపూర్ సెన్సార్ బోర్డుకు పెద్దలకు మాత్రమే చిత్రంగా అంటే ఏ సర్టిఫికెట్ చిత్రంగా తోచింది. ఈ చిత్రంలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో బాహుబలి2 సినిమాకు సింగపూర్ సెన్సార్ బోర్డు ఏ (ఎన్సీ 16) సర్టిఫికెట్ ఇవ్వడంతో వివాదంగా మారింది. ఈ అంశంపై కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ స్పందించారు.

    సింగపూర్‌లో పిల్లలకు చుక్కెదురు..

    సింగపూర్‌లో పిల్లలకు చుక్కెదురు..

    వెండితెరపై తమ హీరో అమరేంద్ర బాహుబలిని చూడాలనుకొన్న సింగపూర్ పిల్లలకు చుక్కెదురైంది. బాహుబలి2 సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో పిల్లలకు బాహుబలి సినిమా చూసే అవకాశం దక్కడం లేదు. ఎన్నో ఏళ్ల తర్వాత రాజులు, గుర్రాలు, ఏనుగులు, యుద్ధాలు వెండితెరపై చూద్దామనుకొన్న పిల్లలకు సింగపూర్ సెన్సార్ షాకివ్వడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

    ఎలాంటి కట్స్ లేకుండా..

    ఎలాంటి కట్స్ లేకుండా..

    బాహుబలి2 సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చాం. అయితే సింగపూర్ సెన్సార్ బోర్డు బాహుబలి హింసాత్మకంగా ఉంది అని అభిప్రాయపడింది. ప్రధానంగా యుద్ధ సన్నివేశాలల్లో సైనికుల తలలు నరకడం క్రూరంగా ఉంది. ఆసియా, యూరప్ దేశాల్లో బాహుబలి చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అని సీబీఎఫ్‌సీ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ పేర్కొన్నారు.

    మన సంస్కృతికి దగ్గరగా..

    మన సంస్కృతికి దగ్గరగా..

    బాహుబలి మన సంస్కృతి సంప్రదాయాలకు దగ్గరగా ఉంది. మన పురణాల్లో, మత పరమైన చరిత్రల్లో రాక్షసుల తలలు తెగ నరికిన చిత్రాలు ఉన్నాయి. మన పిల్లలు అలాంటి హింసాత్మక కథలు వింటూ పెరిగారు. అలాంటి హింసాత్మక పురాణాలంటే మన పిల్లలకు ఎలాంటి భయం లేదు అని నిహ్లనీ తెలిపారు.

    మనోభావాలకు వ్యతిరేకంగా..

    మనోభావాలకు వ్యతిరేకంగా..

    మన మనోభావాలకు వ్యతిరేకంగా భారత సెన్సార్ బోర్డు నిర్ణయాలు తీసుకోదు. ఒక తల నరికే సన్నివేశాన్ని కట్ చేస్తే మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలవుతాయి. ముద్దు సన్నివేశాలను కుదిస్తేనే తప్పు పడుతారు. పండువెన్నెలలో స్వయంరతికి పాల్గోనే అబ్బాయి సన్నివేశాలను కత్తిరిస్తే మేమేదో తప్పు చేసినట్టు ఫీలవుతారు అని పహ్లాజ్ నిహ్లానీ అన్నారు. సింగపూర్ సెన్సార్ బోర్డు బాహుబలికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడంపై ఆ దేశాల అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం అని అన్నారు.

    1500 కోట్ల క్లబ్ వైపు..

    1500 కోట్ల క్లబ్ వైపు..

    ప్రభాస్ రానా, అనుష్కశెట్టి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ నటించిన బాహుబలి2 చిత్రం ఏప్రిల్ 28న విడుదలై ప్రపంచ దేశాల్లో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్నది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1425 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది.

    English summary
    Filmmaker SS Rajamouli's Baahubali 2: The Conclusion has been slapped with an 'A' certificate in Singapore. SS Rajamouli owes a great deal to the children who flocked to the theatres to watch their favourite superhero, Amarendra Baahubali. Sadly, children under the age of 16 can't watch Baahubali 2 in Singapore, as the Singapore censor board has given a 'NC 16' certificate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X