»   » ‘మనం’ డైరెక్టర్ విక్రమ్ కుమార్ పెళ్లి డేట్ ఫిక్స్, వెడ్డింగ్ కార్డ్ ఇదే (ఫోటోస్)

‘మనం’ డైరెక్టర్ విక్రమ్ కుమార్ పెళ్లి డేట్ ఫిక్స్, వెడ్డింగ్ కార్డ్ ఇదే (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఇష్క్, మనం, 24 చిత్రాలతో వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్. ఇంతకాలం అతని పర్సనాలిటీ చూసి ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలియని వారంతా అతనికి పెళ్లి అయి ఉంటుందని భావింవచారు. కానీ మనోడు ఇంకా బ్యాచిలరేనంట

తాజాగా విక్రమ్ కుమార్ పెళ్లి సెట్టయింది. 27 ఏళ్ల సౌండ్ డిజైనర్ శ్రీనిధి వెంకటేష్ ను ఆయన పెళ్లాడబోతున్నారు. జూన్ మాసంలో వీరి ఎంగేజ్మెంట్ జరుగిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి డేట్ ఫిక్సయింది. కార్డుల డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తయింది.

విక్రమ్ కుమార్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం...'విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 24 సినిమా సమయంలో విక్రమ్, శ్రీనిధి ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారట. సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారం కూడా ఉండటంతో ఓ ఇంటివారు కాబోతున్నారు.

శ్రీనిధి కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే కావడంతో ఇద్దరూ త్వరగా కనెక్ట్ అయ్యారు. శ్రీనిధి సౌండ్ డిజైనర్ గా ఆస్కార్ అవార్డ్ విన్నర్ రెహమాన్ తో కలిసి 24 సినిమాకు పని చేసారు.

పెళ్లి ముహూర్తానికి సంబంధించిన విశేషాలు, వెడ్డింగ్ కార్డ్ ఫోటోస్ స్లైడ్ షోలో..

విక్రమ్ వెడ్స్ శ్రీనిధి

విక్రమ్ వెడ్స్ శ్రీనిధి

సెప్టెంబరు 4న ఉదయం 6.30 నుండి 7.30 గంటల మధ్య వీరి వివాహ వేడుక చెన్నైలోని హిల్టన్ హోటల్లో జరుగబోతోంది.

వెడ్డింగ్ కార్డ్

వెడ్డింగ్ కార్డ్

విక్రమ్ తండ్రి ఇప్పటికే కాలం చేయడంతో ఆయన తల్లి విశాల విజయకుమార్ పేరు మీద కార్డ్స్ అందాయి. శ్రీనిధి తల్లిదండ్రుల పేర్లు.. జయశ్రీ..వెంకటేష్ గా కార్డులపై పేర్కొనబడ్డాయి.

విక్రమ్ కుమార్

విక్రమ్ కుమార్

పెళ్లి తర్వాత విక్రమ్ కుమార్ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోతాడు. మహేష్ బాబు, బన్నీలతో అతను సినిమాలు కమిటైనట్లు సమాచారం.

శ్రీనిధి

శ్రీనిధి

భర్త సినిమాలకు తానే సౌండ్ డిజైనర్ గా శ్రీనిధి పని చేయబోతోతోంది.

English summary
Filmmaker Vikram K Kumar, known for films like Manam, Ishq and 24, has only made around four films but he has been the face of new age cinema across South India. It was earlier made it to the headlines that the 24 maker was engaged to a sound engineer Srinidhi on June. Now news has that Vikram will get married to her on 4th September.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu